విశాఖ

చంద్రబాబుతోనే ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 24: ప్రత్యేక హోదాకు మించి ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ప్యాకేజీ పేరిట కేంద్రం నుండి నిధులు సేకరించిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కుతుందని జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కితాబునిచ్చింది. స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్టు హాలులో శనివారం జరిగిన జిల్లా దేశం సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పప్పల చలపతిరావు అధ్యక్షత వహించారు. జిల్లాలోని పలువురు అధికార, అనధికార తెలుగుదేశం సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి విచ్చేశారు. జిల్లా అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని ప్రశంసిస్తూ ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సిఎం చంద్రబాబును కోరుతూ పలు తీర్మానాలు చేశారు. ప్రత్యేక హోదాకు మించి ఏపీకి నిధులను కేంద్రం నుండి రాబట్టడంలో సిఎం చంద్రబాబు కృషిని ఇందుకు అండగా నిలిచిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు, ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది. వర్షాల వలన ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, విశాఖ ఏజెన్సీలో జ్వర బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపాలని,విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో 90:10 నిష్పత్తి అమలుకు చర్యలు తీసుకోవాలని సిఎంను కోరుతూ సమావేశం తీర్మానించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు 1800కోట్లు మంజూరుచేసిన సిఎం చంద్రబాబుకు సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది. బ్రాండిక్స్ వ్యర్ధజలాలకు నష్టపరిహారంగా 61కోట్లు బాధితులకు నష్టపరిహారాన్ని విడుదల చేయడం, సముద్రతీరంలో టూరిజం అభివృద్ధికి 51కోట్లు మంజూరు చేయడం, జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీలకు రూ.24కోట్లు రుణాలు మంజూరు చేయడం తదితర చర్యలకు దోహదం కలిగించిన సిఎంకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. సమావేశంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సభ్యునిగా ఏనాడు కేంద్రాన్ని కోరని జగన్‌మోహన రెడ్డి ఏపీలో ప్రతిపక్ష నేత హోదాను చేపట్టాక ప్రత్యేక ప్యాకేజీ గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీకి సిఎం చంద్రబాబు పరిశ్రమలను తీసుకువస్తే దివంగత సిఎం వైఎస్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు సాగునీటి ప్రాజెక్టులను, పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనతను అప్పటి ప్రభుత్వ దక్కించుకుందని అవహేళన చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఈ ఏడాదిలోగా చాలావరకు పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత, కిడారి సర్వేశ్వరరావు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు. జిల్లా తెలుగుమహిళా నూతన అధ్యక్షురాలు కె. లీలావతిని ఈ సమావేశంలో సత్కరించారు. స్థానిక ఎంపీపి కొణతాల వెంకట సావిత్రీ, జిల్లా టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు విష్ణుమూర్తి, డాక్టర్ నారాయణరావు, పట్టణ టిడిపి అధ్యక్షులు బుద్ద నాగజగదీష్, మళ్ల సురేంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.