వరంగల్

పన్నుల ఎగవేతను నియంత్రించి..ఆదాయాన్ని పెంచడానికే జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, సెప్టెంబర్ 27: దేశంలో ప్రవేశపెట్టిన వస్తుసేవా పన్ను విధానం పన్నుల ఎగవేతను నియంత్రించి, ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుందని మాజీ ఉపకులపతి ఆచార్య వెంకటరత్నం అన్నారు. మంగళవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్వర్యంలో భారతదేశంలో జిఎస్‌టి అమలు-తీరుతెన్నులు అనే అంశంపై ఒకరోజు సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకటరత్నం హాజరై ప్రసంగించారు. దేశంలో ప్రవేశపెట్టిన బిల్లులలో జిఎస్‌టి బిల్లు ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ బిల్లుగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలుచేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని తీసుకునివచ్చిందని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకే పన్ను విధానం ఉండడం వలన ఉత్పత్తిదారులకు ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఒక ఉత్పత్తిపై ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు పడేవని, ఈ బిల్లుతో ఒకే పన్ను పడుతుందని పేర్కొన్నారు. దీనితో వినియోగదారులకు కూడా ఉపయోగం ఉంటుందని వివరించారు. అత్మీయ అతిథులుగా కామర్స్ డీన్ ఆచార్య సుబ్రమణ్యశర్మ, ఆచార్య సాయిలు, సి ఎ గణేష్‌బాలకిషన్‌లు మాట్లాడుతూ దేశంలో వర్తక వాణిజ్య విస్తరణకు, వస్తు ఉత్పత్తి రంగంలో ఆశించిన మేరకు సత్పలితాలు సాధించడానికి జి ఎస్‌టి ఎంతో మేలు అని తెలిపారు. చిన్న, మద్య, భారీ పరిశ్రమల ఉత్పత్తులకు ఒకే పన్ను విధానం అమలులోకి రావడం శుభసూచకమని వివరించారు. సభాధ్యక్షత వహించిన రామానుజరావు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, భారతదేశంలో వస్తు సేవల పన్ను విధానం చాలా తక్కువ అని తెలిపారు. సదస్సు డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ జి ఎస్‌టిపై అందరికి అవగాహన కలుగాలనే ఉద్దేశ్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ అమరావతి, డా.సునీత, డా.సరిత, డా.రాజ్‌కుమార్, డా.పణీందర్ తదితరులు పాల్గొన్నారు.