సంజీవని

ఈ ఫరీక్షలు ఎందుకో తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తంలోని వివిధ పదార్థాలు, వాటి స్థాయి తెలుసుకోవడానికి ‘్ఫల్ బ్లడ్ కౌంట్’ రక్తపరీక్ష తోడ్పడుతుంది. ఈ పరీక్షలతో ఎనీమియా, ఇన్‌ఫెక్షన్స్ తెలుసుకోవచ్చు.
ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ స్థాయి ఎముకల జబ్బులలో మామూలుగా కన్నా ఎక్కువగా ఉండడంతో పసిగట్టవచ్చు. హెపటైటిస్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, కాన్సర్, బైల్‌డక్ట్ అడ్డంకులు, గాల్‌స్టోన్స్‌కి కూడా ఇది సంకేతం. పెరిగే పిల్లల్లో ఇది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఎ.ఎస్.టి (యాస్పిరేట్ ట్రాన్స్‌ఎమినేజ్), ఎ.ఎల్.టి (అలానిన్ ట్రాన్స్ ఎమినేజ్), ఎ.ఎస్.టి. ఎంజైమ్, గుండె, కాలేయం పెరగడంతో తెలుస్తుంది. కాలేయం దెబ్బతినడంతో ఎ.ఎల్.టి ఎంజైమ్ స్థాయి పెరుగుతుంది.
బిలిరుబిన్ ఎక్కువగా ఉంటే ‘జాండిస్’ వచ్చిందని నిర్థారణవుతుంది. లివర్ డిసీజ్‌లోనే కాదు కొన్ని ఎనీమియాలు, బైల్‌డక్ట్ బ్లాక్ అయిన విషయం తెలుస్తుంది బిలిరుబిన్ ఎక్కువ కావడంతో.
బోన్ కాన్సర్, పేరాథైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువకావడం, ఆస్టియోపోరోసిస్ లాంటివి రక్తంలో కాల్షియమ్ స్థాయి ఎక్కువవడం వల్ల తెలుస్తుంది. విటమిన్ డి లోపం, మూత్రపిండాల వ్యాధులు, పారాథైరాయిడ్ స్థాయి తగ్గడం లాంటి వాటిని కాల్షియమ్ స్థాయి తగ్గడంతో గుర్తింవచ్చు.
సోడియమ్ క్లోరైడ్, పొటాషియమ్ శరీర బాలన్స్‌ని పరిరక్షిస్తుంటాయి. బైకార్బొనేట్ యాసిడ్ బాలన్స్‌ని సరిచూస్తుంది. మూత్రపిండాల వ్యాధులలో ఎలక్ట్రోలైట్ పరీక్ష తోడ్పడుతుంది.
మూత్రపిండాల పనితీరుని తెలుసుకోవడానికి బ్లడ్ యూరియా పరీక్ష సహకరిస్తుంది.
కొలెస్ట్రాల్ పరీక్షతో కొలెస్ట్రాల్ స్థాయి రక్తంలో తెలుసుకుంటారు. రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తెలుసుకోవచ్చు. ప్రొటీన్ల జీర్ణంలో వచ్చే క్రియాటినిన్‌ని తెలుసుకునే రక్తపరీక్ష ఉంది. మూత్రపిండాల పనితీరుని ఇది చెబుతుంది.
బ్లడ్‌గ్లూకోజ్ పరీక్షతో రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ గురించి తెలుసుకుని, డయాబెటిస్‌ని అంచనా వేయవచ్చు.
ఐరన్ పరీక్షతో రక్తంలోని ఐరన్ గురించి తెలుసుకుని, ఎనీమియాని అంచనా వేయవచ్చు. మూత్రపిండాల పేరాథైరాయిడ్ పనితీరులను తెలుసుకోవడానికి ఫాస్పరస్ పరీక్ష ఉపకరిస్తుంది.
ఇలా ఎన్నో విషయాల్ని పసిగట్టడానికి రక్తపరీక్షలు తోడ్పడతాయి.

డా.కె.వలీపాషా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి
యోగి వేమన విశ్వవిద్యాలయం..
98492 16278

డా.కె.వలీపాషా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి యోగి వేమన విశ్వవిద్యాలయం.. 98492 16278