అంతర్జాతీయం

హఫీజ్ కరడుగట్టిన ఉగ్రవాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 14: జమాత్ ఉత్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ కరుడుగట్టిన ఉగ్రవాదేనని అమెరికా పునరుద్ఘాటించింది. జమా త్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలు వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయని అన్నారు. రోజువారీ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మాట్లాడుతూ ఐరాస కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ పేరు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో లష్కరేకు సంబంధాలున్నాయని ఆయన విమర్శించారు. జమాత్ ఉత్ దవా, లష్కరే తొయిబా విధ్వంసక, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ వందలాది మంది అమాయకులను బలితీసుకున్నాయని టోనర్ స్పష్టం చేశారు. అమెరికా కూడా ఎందరో పౌరులను కోల్పోయిందని ఆయన అన్నారు. ఇలా ఉండగా అమెరికా కూడా పాకిస్తాన్‌కు బద్ధశత్రువంటూ సరుూద్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తరువాత సరిహద్దుల్లో భారత్ జరిపిన సర్జికల్ దాడులకు అమెరికా మద్దతు ఇవ్వడంతోపాటు ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది.