మంచి మాట

దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయం, గుడి,ఇవన్నీ దేవుడు కొలువుండే స్థలాలు. వాటిని పవిత్రంగా భావిస్తాం. ఈ దేవాలయాలను మనం రోజు దర్శించాలని శ స్త్రాలు చెబుతున్నా పవిత్రమైన రోజుల్లో నైనా మనం వాటిని దర్శించుతాం. దేహమే దేవాలయం అన్నవారు కూడా లేకపోలేదు. దేహాన్ని దేవాలయంగా చూసుకొనేవారు కేవలం సత్యధర్మాలనే వారి ఆధారంగా చేసుకొంటారు. ఇతురులెవ్వరికీ అన్యాయం చేయరు. అంతేకాక ఎవరైనా బాధపడుతుంటే వారు చూస్తు వూరుకోక వారికి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేస్తారు. ‘గుడి’ ప్రాముఖ్యత, ప్రభావం తెలియకచాలామంది ఈరోజు మేము పనుల ఒత్తిడితో ఉన్నాం కనుక గుడికి రాలేము అంటుంటారు. గుడిలో అర్చన లాంటి సేవల వలన లేక గుడిలోని ప్రశాంత వాతావరణం వల్ల ఆ ప్రదేశం అంతా పవిత్రమై ఉంటుంది. భగవంతుని శక్తి నుంచి వెలువడే కాంతి కిరణాలు మనుషుల్లోని అలజడి ని తగ్గిస్తాయ. పైగా అక్కడ శబ్దం వల్ల అంటే అక్కడి వారు చేసే పారాయణల వల్లనో లేక పూజాదికాల వల్లనో వాతావరణం ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనసుల్లోని అలజడి క్రమంగా తగ్గి చేయవలసిన పనులకు కావాల్సిన శక్తి ఒనగూరుతుంది. ఇది కొంతమంది శాస్త్ర ప్రకారం పరిశోధించి కూడా చెప్పి ఉన్నారు.
భగవంతుడు నిరాకారుడు. నిర్గుణుడు. నిరంజనుడు. భగవంతుడెక్కడ? అంటే సూర్యుడిగా వెలుగుతున్నాడు, గాలిగా వీస్తున్నాడు, వర్షంలా కురుస్తున్నాడు, శబ్దంలా వినపడుతున్నాడు, కదలికలా కనబడుతున్నాడు అని చెప్తాం. ‘ఈశ్వరస్సర్వభూతానాం-హృద్దేశేర్జున తిష్ఠతి’ ఈశ్వరుడు అన్ని జీవుల్లోని హృదయాల్లో చైతన్యరూపంలో ఉన్నాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు. కాని దేవాలయ సందర్శనం చంచల స్వభావులైన మనుషుల్లో చంచలత్వాన్ని దూరం చేస్తుంది. అచంచలమైన నమ్మకాన్ని కల్గిస్తుంది.
సృష్టికర్త సృష్టి భర్త సృష్టి హర్త అన్నీ భగవంతుడే. ‘సృష్టిస్థితి లయకారకుడు’ ఆ భగవంతుడే. ఇచ్చేవాడు దేవుడు, పుచ్చుకునేవాడు మానవుడు, కాని స్వభావాలు గుణాల వల్ల మానవుల్లో భేదాలు ఏర్పడ్డాయ. వారిలో తమోగుణం రజో గుణం హెచ్చు స్థాయలో ఉండడంతో సత్వగుణం అణగారిపోతుంది. అన్యాయాలు చేస్తుంటాడు. సత్వగుణం నశించి అహకారాదులకు బానిస అయన మనిషి ఇతరులను హింసించడానికి పూనుకొంటాడు. అట్లాంటపుడు నిరాకార భగవంతుడు సాకారుడు అవుతాడు. పరమాత్మ తన్ను తాను సృజియంచుకుంటాడు. అతడే ఆ అహంకారాది జీవుల పతనం కావిస్తాడు. తిరిగి సత్వగుణాన్ని పైకి లేపుతాడు. ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. అపుడు మానవులంతా సత్వగుణ సంపన్నులై అయ అంతా భగవంతుడే అని సర్వం ఈశ్వరమయం సర్వాంతర్యామి భగవంతుడు అని అంటారు. నరుల్లోనారాయణుడి దర్శనంచేసుకొంటారు.
గుళ్లో నిత్యమూప్రణవ నాదం వినిపిస్తుంటుంది. దానికి కారణం ‘ఓంకార మూల మంత్రాఢ్యః’....అన్ని మంత్రాల మూలమూ ‘ఓంకారం’లోనే ఉంది.కనుక అక్కడ ఆ ఓమ్ కారమేవినిపిస్తుంది. దేవాలయాలు చేతన్యకేంద్రాలుగా విలసిల్లుతూ త్యాగ గుణం మనుషుల్లో వృద్ధి చెందాలి కనుక అక్కడ అన్నదానం చేస్తుంటారు. సాటి మనిషికి పెట్టే తత్వం లేని వాడు సైతం భగవంతుని పేరుచెప్పుకుని ఓ రూపాయ అయనా అక్కడ దానం చేస్తుంటాడు. కనుక దేవాలయం మనుషుల గుణాల్లో కూడా మార్పు తెస్తుంది. అక్కడ చెప్పే పౌరాణికాంశాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగి చదువుకునే దిశగా కూడా మానవుడు అడుగులు వేస్తాడు. కనుక మనుషుల్లో మార్పు కు దోహదం చేసే ఈ దేవాలయాలు నిత్య చైతన్యకేంద్రాలు దేవాలయంలో చేసే ప్రదక్షణలు కూడా మనిషి ఆరోగ్యంలో కూడా మార్పు తెస్తుంది. అటు మానసికంగాను ఇటు శారీరకంగాను కూడా మానవునిలో మార్పు తెచ్చే దేవాలయాల సందర్శన మంచిది.

- రాంప్రసాద్