తూర్పుగోదావరి

ఖరీఫ్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, అక్టోబర్ 28: రానున్న ఖరీఫ్ సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇందుకు గాను రూ.12వేల కోట్లు కేటాయించామన్నారు. శుక్రవారం దిండి రిసార్ట్స్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో రేషన్ పక్కదారి పట్టేదని, టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇ-పోస్ విధానం ప్రవేశపెట్టి అర్హులందరికీ సక్రమంగా రేషన్ అందిస్తున్నామన్నారు. రేషనుకార్డుల కోసం 4.72 లక్షల దరఖాస్తులు వచ్చాయని, జన్మభూమి కార్యక్రమంలో వారికి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29వేల మంది డీలర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీచేసి వారికి కైజల యాప్ సృష్టించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా 2017 జూన్ నాటికి దీపం పథకంలోగ్యాస్ కనెక్షన్లు పంపిణీ పూర్తిచేస్తామని ఆమె ప్రకటించారు. క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీకి టెండర్లు పిలిచినట్టు మంత్రి సునీత వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, సివిల్ సప్లయిస్ డిఎం ఎ నరసింహారావు, డిఎస్‌ఒ వై ఉమామహేశ్వరరావు, ఎఎస్‌ఒ నిత్యానంద్, జిల్లా రైసు మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎ రామకృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ బందెల పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హౌస్ బోట్‌పై వసిష్ఠ నదిలో విహరించారు. ఆ తరువాత మంత్రి సునీత అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక బృందం మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యారావు, మలికిపురం జడ్పీటిసి మంగిన భూదేవి, ఎంపిపిలు జి గంగా భవాని, పి లక్ష్మీసరస్వతి, సర్పంచ్‌లు కాకి లక్ష్మీదేవి, బందెల పద్మ తదితరులు పాల్గొన్నారు.