తెలుగు నేర్చుకుంటున్నా - హీరోయిన్ మంజిమ మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో హీరోయిన్లిద్దరూ ప్రేమలో మునిగిపోయి తమ ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నారు? వారు చేసిన సాహసం ఏమిటి? ప్రేమే శ్వాసగా సాగే ప్రేమికుల కథనం ఎలా ఉంటుంది? అన్న పాయింట్‌తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవమీనన్ అద్భుతంగా తెరకెక్కించారని హీరోయిన్ మంజిమ మోహన్ అన్నారు.
నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవీందర్‌రెడ్డి రూపొందించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయిక మంజిమ మోహన్ చిత్ర విశేషాలను తెలిపారు.
అవకాశం అలా..
చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన నేను హీరోయిన్‌గా ‘ఒరువడక్కన్’ సెల్ఫీ చిత్రంతో కథానాయికగా మారాను. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు వాసుదేవ మీనన్ ఆడిషన్‌కు రమ్మని పిలవడంతో వెళ్లాను. అక్కడ ఎంపికయ్యాను. మొదట తమిళ సినిమాకోసమే అనుకున్నాను. దర్శకుడు తెలుగు, తమిళ సినిమా చేస్తున్నామని చెప్పగానే భాషా సమస్య ఉంటుందన్న భయంతో చేయలేనన్నాను. కానీ దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమా చేశాను.
తెలుగు అర్ధవౌతోంది
తెలుగులో నటించడం ఓ అందమైన అనుభవంగా మిగిలింది. ముందు నాకు తెలుగు ఓ ఏలియన్ భాషలా అనిపించేది. ఈ సినిమా చేయడంతో అప్పుడప్పుడు కొంత అర్ధం చేసుకుంటూ నటించడంతో సులభమనిపించింది. నేను మలయాళీ కనుక తమిళం కూడా మాట్లాడగలను. ఇప్పుడు తెలుగు అర్ధం చేసుకోగలను.
ఒకే కథలో ఇద్దరు హీరోలు
వేరువేరు హీరోలతో ఒకే సినిమా చేయడం ఇబ్బంది అనిపించలేదు. కానీ ఒకే సీన్‌ను వేరువేరుగా చేయడం ఇబ్బంది అనిపించింది. ఇద్దరు హీరోలు సహకరించడంతో నాకు ధైర్యం వచ్చింది. నాగచైతన్య ముందురోజే తెలుగు నేర్పేవారు. తెలుగు డైలాగులు నేర్చుకుని నటించాను.
కుటుంబం ఒప్పుకోలేదు
మా నాన్న మలయాళ సినిమాల్లో ఫొటోగ్రాఫర్. బాల నటి అవసరం అవడంతో నన్ను నటించమని అడిగారు. అలా నటించడం మొదలుపెట్టాను. హీరోయిన్ కావాలనుకోగానే నాన్నకే చెప్పాను. ఆయనకు పూర్తి అవగాహన ఉండడంతో కష్టపడకుండానే అవకాశం వచ్చింది.
నాగచైతన్యతో..
అతను మంచి కో స్టార్. సెట్స్‌లో తనుంటే కంఫర్ట్‌గా ఉంటుంది. డైలాగుల విషయంలో చాలా సపోర్టివ్. ఎలా చేయాలో డిస్కస్ చేసేవాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడం నేను వీకే. ఇబ్బంది పడేదాన్ని. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకపోవడంతో అందరూ చెప్పిన విధంగా నటించుకుంటూ వెళ్లాను అంతే.
సింపుల్ గర్ల్
ఈ సినిమాలో లీల అనే సింపుల్ అమ్మాయిగా నటించాను. చైతన్య స్నేహితుడి చెల్లెలి పాత్రలో కనిపిస్తాను. మొదటి సగం అంతా లవ్‌ఫీల్‌తో వుంటే రెండో సగం అంతా యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుంది.
వెయిటింగ్ సమస్యలు
నిజానికి ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పుడు చాలా వత్తిడికి గురయ్యా. అయితే దర్శకుడు మంచి సినిమా అని మంచి ఔట్‌పుట్ కావాలంటే సహనం కావాలని చెప్పడంతో వెయిటింగ్ చేశా. రెండు భాషల్లో సినిమా తెరకెక్కేటప్పుడు అలాంటి సమస్యలు ఉంటాయని అర్ధమైంది.
ఫ్రెండ్స్ లేరు
పర్టిక్యులర్‌గా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. అందరితో స్నేహంగానే ఉంటాను. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ గురించి, తెలుగు సినిమాల గురించి ఇటీవలే తెలిసింది. వీరి సినిమాలు మలయాళంలో డబ్బింగ్ అయ్యాయి.
ఇలా.. అలా చేయమని..
ఈ సినిమా చేసేటప్పుడు క్లైమాక్స్‌లో ఏడ్చేశాను. నాన్న నన్ను చూసి ఏడ్చారు. అప్పుడు నా నటన పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారని అర్ధం చేసుకున్నా. అంతే తప్ప ఎవరూ అలా చేయి, ఇలా చేయమని ఎప్పుడూ చెప్పలేదు.
నెక్స్ట్ ప్రాజెక్టులు
కొన్ని చర్చల దశలో ఉన్నాయి. త్వరలో చెబుతాను.

- యు