అంతర్జాతీయం

భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 1: భారత్‌తో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ దేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కమిటీ తన నివేదికలో రక్షణ మంత్రికి, విదేశాంగ మంత్రికి సూచించింది. 618 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా జాతీయ రక్షణ ఆథరైజేషన్ బిల్లు (ఎన్‌డిఏఏ)కు సంబంధించి మూడు వేల పేజిలకు పైగా ఉండే అమెరికా కాంగ్రెస్ కాన్ఫరెన్స్ నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అలాగే రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించి మిలిటరీ ఆపరేషన్లు కొనసాగించడానికి, మద్దతు తెలియజేయడానికి భారత్‌కు ఉన్న సామర్థ్యాలను అంచనా వేయాలని కూడా ఆ నివేదిక రక్షణ మంత్రిని, విదేశాంగ మంత్రిని కోరింది. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌కు చెందిన సాయుధ దళాల కమిటీ బుధవారం ఈ నివేదికను బహిర్గతం చేశాయి. ఈ నివేదికపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేసి చట్టరూపం కల్పించడానికి ముందు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఉభయ సభలు అంటే ప్రతినిధుల సభ, సెనేట్ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది.