శ్రీకాకుళం

ఘనంగా 94వ ఘంటసాల జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 4: మండల కేంద్రంలో స్థానిక గాంధీ కళామండపంలో ఘంటసాల 94వ జయంత్యుత్సవాలు కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గీత్ సంగీత్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఘంటసాల మల్లేశ్వరరావు, పాడుతా తీయగా ఫేం. స్వాతిజగన్ లు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జెడ్పిటీసీ సిహెచ్ శకుంతల , సర్పంచ్ చిట్టిబాబు, ఏ ఎం సి అధ్యక్షులు బైరి భాస్కరరావు తదితరులు ఘంటసాల చిత్ర పటం వద్ద జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేటి నుంచి కానిస్టేబుల్ ఎంపికలకు దేహదారుఢ్య పరీక్షలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 4: రాష్టస్థ్రాయి పోలీస్ నియామక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎంపికలకు దేహదారుఢ్య పరీక్షలను స్థానిక ఎ ఆర్ పోలీసు క్రీడా మైదానంలో సోమవారం నుంచి నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో పురుషులు, మహిళలను కలుపుకొని ఐదు వేల మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారని అధికారులు స్పష్టం చేశారు. దీనిలో సివిల్, ఎ ఆర్ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్లకు సంబంధించిన ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున గురువారం వరకు శారీరక కొలతులతోపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పురుషులకు ఎత్తు, ఛాతి కొలతలు, మహిళలకు ఎత్తు, బరువు కొలతలు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. తర్వాత 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందేం, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అంబేద్కర్ వర్ధంతిని జయప్రదం చేయండి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 4: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 60వ వర్థంతి సభను జయప్రధం చేయాలని దళితరత్న బోస్ మన్మధరావు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈనెల 6న ఉదయం 9గంటలకు నగరంలోని ఇలిసీపురం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఈ వర్థంతి కార్యక్రమం జరుగునని తెలియజేశారు. పై కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందని జిల్లా నాయకులు హాజరు కావాలని కోరారు.