శ్రీకాకుళం

ఓవరాల్ ఛాంపియన్ ‘శ్రీకాకుళం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, డిసెంబర్ 4: జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మూడవ అంతర్‌జిల్లా క్రాస్‌కంట్రీ పోటీల ఛాంపియన్‌షిప్‌గా శ్రీకాకుళం కైవశం చేసుకుంది. రెండు ఏజ్ గ్రూప్‌ల మినహా అన్ని అంశాల్లో శ్రీకాకుళం వాసులు సత్తాచాటడంతో పాయింట్ల ప్రాతిపదికన ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు. 16 ఏళ్ల బాలుర విభాగం రెండు కిలోమీటర్ల పరుగులో కె.కృష్ణ (శ్రీకాకుళం), బి.మోహనరావు (శ్రీకాకుళం), పి.సోమేశ్వరరావు (విజయనగరం)లు విజేతలు కాగా, 18 ఏళ్ల బాలుర విభాగం ఆరు కిలోమీటర్ల పరుగులో జె.శంకరరావు (విజయనగరం), వై.రాఘవేంద్ర (అనంతపురం), సిహెచ్.తవిటిరాజు (శ్రీకాకుళం)లు వరుస విజేతలుగా నిలిచారు. అండర్-20 విభాగం ఎనిమిది కిలోమీటర్ల పరుగులో జి.రాములు (కృష్ణ) ఎన్.గోవర్థనరావు (విశాఖపట్నం), ఎ.మునీంద్ర కుమార్ (కృష్ణ)లు పతకాలు కైవశం చేసుకోగా, పురుషుల విభాగం 12 కిలోమీటర్ల పరుగులో పి.చంద్రబాబు (కృష్ణ), కె.శివ (తూర్పుగోదావరి), కె.యు.సంజీవరాయుడు (అనంతపురం)లు బంగారు, రజిత, కాంస్య పతకాలు కైవశం చేసుకున్నారు. బాలికల విభాగం అండర్-16 రెండు కిలోమీటర్ల పరుగులో శ్రీకాకుళంకు చెందిన బి.జీవిత, జి.కుమారి, ఎ.చంద్రుడమ్మలు విజేతలు కాగా, అండర్-18 నాలుగు కిలోమీటర్ల పరుగులో వి.సంధ్యారాణి (శ్రీకాకుళం), పి.రాగమణి (శ్రీకాకుళం), పి.రమణి (విశాఖపట్నం) వరుస విజేతలుగా కైవశం చేసుకున్నారు. బాలికల అండర్-20 ఆరు కిలోమీటర్ల పరుగులో ఎస్.సరస్వతి (శ్రీకాకుళం), పి.నాగఅరుణ జ్యోతి (పశ్చిమ గోదావరి), ఎ.మాలతి (గుంటూరు) వరుస విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం ఎనిమిది కిలోమీటర్ల పరుగులో కె.దేవి (తూర్పుగోదావరి), జి.హేమలత రెడ్డి (శ్రీకాకుళం), జి.అనూరాధ (శ్రీకాకుళం)లు వరుసగా బంగారు, రజిత, కాంస్య పతకాలు కైవశం చేసుకున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

నగదు రహిత ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించిన జె.సి.
గార, డిసెంబర్ 4: మండలంలోని బందరువానిపేట, రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామాల్లోని చౌక ధరల దుఖాణాలు ద్వారా ప్రభుత్వం అవలంభిస్తున్న నగదు రహిత ఆర్ధిక కార్యకలాపాలను జె.సి. చక్రధర్‌బాబు ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీకి సంబంధించి నగదు రహిత ఆర్ధిక కార్యకలాపాలు ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా చేపట్టింది. ఇందుకు సంబంధించి నగదు రహిత ఆర్ధిక కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది జె.సి. ఆదివారం పరిశీలించారు. ఈయన వెంట ఇన్‌చ్ఛార్జ్ తహశీల్దారు చక్రవర్తి ఉన్నారు.