అదిలాబాద్

వైభవంగా క్రిస్మస్ జరుపుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 5: క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యలయమంలో పండుగ నిర్వహన కమీటి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు. క్రిస్మస్ పండుగా సందర్బంగా ప్రభుత్వం వేయ్యి మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమాని ఉత్సవ కమిటి ,స్థానిక తహసీల్ధార్‌లు పరిశీలించి అర్హులైన నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేసి ఈనెల 16వ తేదిలోగా పంపిణి చేయాలన్నారు. ఈ సందర్బంగా ప్రతి నిమోజిక వర్గ శాసన సభ్యులను సంప్రదించి , నియోజిక వర్గ క్రైస్తవ సంఘల సూచన మేరకు ఈనెల 19నుండి 20తేదిలోగా క్రిస్మస్ విందు వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరుకావాలన్నారు. ఈ వేడుకలను నిర్మన కమిటి సభ్యులు స్వచ్చందగా పాల్గొని వేడుకల వేదికను అందంగా ముస్తాబు చేసుకొవాలని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజిక వర్గనికి రూ 2లక్షలు నిధులను కేటాయించిదని వీటిని క్రీస్మస్ సోదరలు సద్వినియోగ పరుచుకొవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ విఫ్ నల్లాల ఓదెలు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు క్రిస్మస్ వేడకలు నిర్వహిస్తామని పేర్కోన్నారు. ఈనెల 20న మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఎ పంక్షన్ హాల్‌లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జెసి సధాకర్‌రావు, బెల్లంపల్లి ఆర్డీవో పాండురంగరావు. మైనార్టీ వెల్పర్ అధికారి వెంకట్‌నారయణ, నిర్వహణ కమిటి సభ్యులు పద్మరావు, ప్రభుదాస్, శామ్యుల్, మాథ్యూ, రవి తదితరలు పాల్గొన్నారు.