వరంగల్

అన్ని వర్గాలతో చర్చించి స్మార్ట్‌సిటీ డిపిఆర్ రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 5: వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన డిపిఆర్ రూపకల్పనలో ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు చర్చిస్తామని, ఎన్‌జిఓల సలహాలు తీసుకుంటామని వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ శృతి ఓఝా తెలిపారు. బహిరంగ మలవిసర్జనను నగరంలో పూర్తిస్థాయిలో నివారించేందుకు కార్యాచరణను అమలు చేస్తామని చెప్పారు. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్‌గా ఆదివారం పదవీబాధ్యతలు చేపట్టిన శృతిఓఝా సోమవారం తన ఛాంబర్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతు వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించబడటం తనకు సంతోషంగా ఉందని, రాజధాని హైద్రాబాద్ తరువాత పెద్దనగరమైన వరంగల్‌లో బాధ్యతాయుతంగా పనిచేయవలసి ఉందని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ్ వరంగల్‌లో భాగంగా నగరంలో బహిరంగ మలవిసర్జన నివారించే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటానని, దీనికోసం యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. బహిరంగ మలవిసర్జన నివారణలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడానికే ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులు జరగటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, బిల్లుల విషయంలో లబ్ధిదారులు భయపడవలసిన అవసరం లేదని, విడతల వారీగా బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పారు. నగర పరిస్థితులు, సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలనతోపాటు నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో చర్చించి కార్యాచరణకు దిగుతామని తెలిపారు.
కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
సెలవురోజు ఆదివారం వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన శృతి ఓఝా సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆ తరువాత నగరపాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాలను తనిఖీ చేసారు. తెల్లవారుజామున కమిషనర్ శృతిఓఝా నగరంలోని రంగసాయిపేట, శంభునిపేట, కరీమాబాద్, మచిలీబజారు, వరంగల్ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, పెరకవాడ, కాశీబుగ్గ, సాకరాశికుంట తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల అమలు తీరును ఆమె పరిశీలించారు. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు, ఇప్పటి వరకు గుర్తించిన కట్టడాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తీసుకోవలసిన చర్యల గురించి అధికారులకు సలహాలు ఇచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి వివిధ విభాగాలను తనిఖీ చేసారు. సిటీ ప్లానర్, ఉద్యానవన అధికారి, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, పన్నుల విభాగం, బయాలజిస్ట్, అకౌంట్స్ తదితర విభాగాలను తనిఖీ చేసి అక్కడి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఆయా విభాగాలు నిర్ధేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. ఆయా విభాగాల చాంబర్లను శుభ్రంగా ఉంచాలని, ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.