ముస్తాబైన వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు, ఆర్.జె.సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ.. ‘వైశాఖం’ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యం ఉందని, సాంగ్స్ చాలాబాగా వచ్చాయని అన్నారు. కజికిస్తాన్‌లో పాటలు చిత్రీకరించేటప్పుడు అక్కడి ప్రజలు తమకుతాముగా పాటలు వింటూ డాన్సులు చేసేవారని, అక్కడివారికే అంత కనెక్ట్ అవుతుందంటే మన ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదని అన్నారు. హీరో హరీష్, హీరోయిన్ సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారని, వసంత్ మంచి మ్యూజిక్ అందించారని అన్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న చిత్రం వైశాఖం సినిమాను తమిళం, హిందీలో విడుదల చేయాలని అందరూ అడుగుతున్నారని చెప్పారు. కొత్త కథ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, చిన్న చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ను వైశాఖం క్రియేట్ చేస్తుందని అన్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీ్ధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి. వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, స్టిల్స్: శ్రీను, కో డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.