వరంగల్

జిల్లా అభివృద్ధికి సూచనలు, సలహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, డిసెంబర్ 13: జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. జనగామ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విలేఖరులు, జిల్లా స్థాయి అధికారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కన్న పరుశరాములు అధ్యక్షత వహించగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధికి మేధావి వర్గం సహకరించాలని కోరారు. ప్రజల అవసరాలు గుర్తించి వాటి పరిష్కారానికి దోహదపడే కథనాలు ప్రచురించి అధికారులకు తోడ్పాటునందించాలన్నారు. జిల్లా ఏర్పడి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో సాధించిన విజయాలను వివరించారు. మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయని అన్నారు. పాడి పరిశ్రమతో పాటు టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ సమాచార వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న మీడియా ప్రతినిధులు జిల్లా ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డిపి ఆర్వో వీరయ్యతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణకు బంగారు బాటలు
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
శాయంపేట, డిసెంబర్ 13: బంగారు తెలంగాణకు విద్యార్థులు బంగారు బాటలు వేయాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం విద్యార్థినీలకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య రంగానికి పెద్ద పీట వేస్తుందని చెప్పారు. దేశంలో మహిళ పాత్ర గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పడు పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. 1980లో కెయుసిలో ఎంఏ చదువుకున్న రోజుల్లో రేకుల షెడ్డు క్రింద చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. చదివించే శక్తి లేక, చదువు అందుబాటులో లేక చదువు విలువ తెలియక వెనుకబాటు జరిగిందని, ఉద్యోగాల కంటే చదవుకున్న వారు తక్కువగా ఉండేవారని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ ఉండేదని చెప్పారు. ఇప్పుడు చదువించాలనే పట్టుదలతో తల్లిదండ్రులు నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులకు కృషి, అద్భుతమైన పాఠశాల భవనాలు, సదుపాయాలు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ప్రభుత్వం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంతో పోటీ పడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాసని రమాదేవి, జడ్పిటిసి వంగాల రమాదేవి, తహశీల్దార్ రజనీ, ఎంఇఓ పున్నం యాదవరెడ్డి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, పిఎఎంసి డైరెక్టర్ నిమ్మల మహేందర్, నాయకులు బాసని చంద్రప్రకాశ్, వలుపదాసు చంద్రవౌళి, గుర్రం అశోక్, చల్లా చక్రపాణి, అమ్మ అశోక్, కొమ్ముల శివ, దుంపల మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.