వచ్చే ఏడాది దర్శకత్వం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాల్లో విలనిజం మారింది. విలన్ అంటే ప్రత్యేకంగా ఇలాగే ఉండాలనే నియమాలేవీ ఇప్పుడు పాటించడం లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే వైట్‌కాలర్ విలనిజం వచ్చేసింది. విలన్లు మనలాగే ఉంటారు అని అందంగా కూడా ఉంటారు అని నిరూపించాడు నటుడు అరవింద్‌స్వామి. ‘బొంబాయి’ చిత్రంతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత కడలి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి తనిఒరువన్ తమిళ సినిమాతో విలన్‌గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘్ధృవ’ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో తనదైన విలనిజంతో సినిమా విజయంలో ముఖ్య భూమికను పోషించిన అరవింద్ స్వామితో ఇంటర్వ్యూ..
‘్ధృవ’ రెస్పాన్స్ ఎలా వుంది?
చాలా ఆనందంగా వుంది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘్ధృవ’ పెద్ద విజయం సాధించింది.
గ్యాప్ కావాలనే తీసుకున్నారా?
‘సఖి’ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ కూడా చేయాలనుకున్నాను. అలాగే నా పిల్లలతో సరదాగా గడపాలని బ్రేక్ తీసుకున్నాను.
* స్టార్‌డమ్ అంటే ఇష్టం లేదా?
- అలా అని కాదు. ‘దళపతి’, ‘రోజా’ సినిమాల్లో నటించినప్పుడు నా వయస్సు 21 ఏళ్ళు. ఆ సమయంలో నేను సినిమాలు చేయాలనుకోలేదు. ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంటరైన తర్వాత వరుసగా సినిమాలు చేశాను. నాకు సినిమాలే లోకం కాదు. లైఫ్‌లో చేయాల్సిన పనులు ఉండేవి. అందుకే సినిమాలు చేస్తే మొత్తం జీవితం ఇదే అవుతుందని బ్రేక్ తీసుకుని బిజినెస్ చేశాను. గ్లోబల్ ఫైనాన్షియల్ ప్రాసెస్ చేసే బ్యాక్ ఆఫీస్ బిజినెస్ చేశాను. ఆ బిజినెస్‌లో నా దగ్గర 5వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
* ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
- తమిళ సినిమా ‘తనిఒరువన్’ కానె్సప్ట్‌ను మాత్రమే దర్శకుడు మోహన్‌రాజా నాకు ముందు చెప్పాడు. ఆ తర్వాత నేను కూడా స్క్రిప్ట్‌లో భాగమయ్యాను. రెండు నెలల పాటు స్క్రిప్ట్, నా పాత్ర గురించే పనిచేశాం. యాక్టింగ్ చేయడం కంటే వర్క్‌లో ఇన్వాల్వ్ అవ్వడం ఆసక్తిగా అనిపించింది. సిద్ధార్థ్ అభిమన్యు పాత్రని రెగ్యులర్‌గా కాకుండా భిన్నంగా చేస్తే బాగుంటుందని ఫిక్సయ్యా.
* నెగెటివ్ రోల్స్ చేయడానికి కారణం?
- నాకు నెగెటివ్ రోల్స్ చేయాలని కోరిక వుండేది. ఒక నటుడు హీరోగా చేస్తాడు. విలన్‌గా చేస్తాడు. హాలీవుడ్ సినిమాల్లో పర్టిక్యులర్ పాత్రలో నటించే వ్యక్తి చెడ్డవాడేం కాదు. తను ఓ పాత్రను చేస్తున్నాడంతే. ఎప్పుడూ పాజిటివ్ పాత్రలే కాకుండా నెగెటివ్ పాత్రలు కూడా చేయాలి. అప్పుడే నటించడం బోర్ కొట్టదు. ఈ పాత్రలో సిగరెట్ తాగడమో, మందు తాగడమో, కోపంగా ఉండడమో చేయలేదు. నేనెంత విలన్‌గా చేసినా చూసే ఆడియన్స్‌కి బోర్‌కొట్టకూడదు. అలా డిజైన్ చేసిన పాత్రే ఇది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి నెగెటివ్ రోల్స్ అయినా చేస్తా.
* నటన కాకుండా మేకింగ్ అంటే
ఇష్టమంటున్నారు, కారణం?
- నటన అంటే ఆసక్తిలేదని కాదు. కానీ సినిమా మేకింగ్ అంటే బాగా ఇష్టం. నటనతోపాటు బిజినెస్ చేయాలనుకున్నాను. 2006లో నాకు యాక్సిడెంట్ అయి వెనె్నముకకు గాయమైంది. అదే సమయంలో పక్షవాతం కూడా వచ్చి సంవత్సరంపాటు నడవలేకపోయాను. మళ్లీ నార్మల్ వ్యక్తిని కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో నన్నునేను కంట్రోల్ చేసుకోడానికి డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఉండడానికి చాలా చేశాను.
* దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
- వచ్చే ఏడాది చివర్లో దర్శకత్వం చేస్తా. అలాఅని నటనను వదులుకోను. ఇంకో విషయం ఏంటంటే నేను దర్శకత్వం చేసే సినిమాల్లో నేను నటించను. ఇప్పటికే రెండు కథల్ని సిద్ధం చేశాను.
* చరణ్‌తో నటించడం ఎలా వుంది?
- మేము ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాం. చరణ్‌లో మంచి పరిపక్వత ఉంది. ప్రతీ సీన్‌ని చర్చించి, దాన్ని కెమెరాముందుకు తెచ్చేవాళ్లం.
* మళ్లీ మణిరత్నం ఛాన్స్ ఇస్తే?
- తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఆయన మొదటి సినిమా అవకాశం ఇచ్చారని కాదు. ‘దళపతి’ సినిమా చేస్తున్నప్పుడు నేను కొత్త నటుడు, అనుభవం వున్న నటుడని చూడకుండా కథ మొత్తం వివరించారు. ఆయన సీన్‌ను విజువలైజ్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. ఆయనతో పనిచేసిన ప్రతిసారీ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటా.
* మళ్లీ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారా?
- నేను డైరెక్ట్ తెలుగు సినిమా చేయను. ఎందుకంటే నాకు తెలుగు భాష కొత్త. తెలుగు సినిమా చేస్తే భాషపై దృష్టిపెట్టాలి. అలాఅని తమిళ్ అంటే ఇష్టం, తెలుగంటే ఇష్టంలేదని కాదు. నేను లాంగ్వేజి నేర్చుకోవడంలో చాలా వీక్. ప్రస్తుతానికైతే తమిళ సినిమాలపైనే ఫోకస్ పెట్టాను.
* తదుపరి చిత్రాలు?
- ఇటీవల బోగస్ చిత్రంలో నటించాను. చదరంగం వేట్టై సీక్వెల్ చేస్తున్నాను. అలాగే పోలీస్ వృత్తిలో ఓ వ్యక్తి పాతికేళ్ల అనుభవంతో కూడిన వసంగముడి అనే కథ రాసుకున్నాను. దానిలో నటిస్తున్నాను. దాంతోపాటు మమ్ముట్టి నటించిన భాస్కర్ ‘ది రాస్కెల్’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నా.

- శ్రీ