అంతర్జాతీయం

బాగ్దాద్‌లో పేలిన కారు బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జనవరి 2: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో సోమవారం జనసమ్మర్ధం గల ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 32 మంది మృతి చెందారు. 61 మంది గాయపడ్డారు. షియా తెగకు చెందిన ముస్లింలు ఎక్కువగా నివసించే ఈ నగరంలో కారు బాంబు దాడికి గురయిన బాధితుల్లో ఎక్కువ మంది కూలి పనులకు వెళ్లడానికి ఎదురుచూస్తున్న రోజువారీ కూలీలే. పేలుడు సంభవించిన తరువాత సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ఫొటోల్లో దట్టమైన పొగలు పైకి లేస్తుండటం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తుండటం కనిపించింది. పేలుడు వల్ల 32 మంది మృతి చెందారని, 61 మంది గాయపడ్డారని ఒక పోలీస్ కల్నల్ తెలిపారు. బాగ్దాద్‌లో గత మూడు రోజుల్లో జరిగిన రెండో పెద్ద పేలుడు సంఘటన ఇది. సెంట్రల్ బాగ్దాద్‌లో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శనివారం సంభవించిన జంట పేలుళ్లలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గత రెండు నెలల్లో బాగ్దాద్‌లో ఇంత తీవ్రస్థాయిలో ఉగ్రవాద దాడి జరగడం ఇదే తొలిసారి. అయితే నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జరిగిన జంట పేలుళ్లుసహా ఇటీవల జరిగిన ఇలాంటి దాడులకు తామే పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించారు.

చిత్రం..బాంబు పేలుడుకు ధ్వంసమైన కారు