శ్రీకాకుళం

స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ పథకాలకు బడ్జెట్‌లో నిధులు పెంచాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జిల్లాలో నలుమూలల నుండి స్కీమ్ వర్కర్లు సమ్మెలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ఏడురోడ్ల జంక్షన్, పాతబస్‌స్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈసందర్భంగా సిటు నాయకులు మాట్లాడుతూ స్కీమ్‌వర్కర్ల సమస్యలు పరిష్కారానికి ఒక్కరోజు సమ్మె చేస్తున్నామని, పరిష్కారం కాకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మె చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు వేలాది కోట్లు సబ్సిడీగా ఇస్తున్నారన్నారు. అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, ఉపాధి హామీ పథకం,సాక్షరభారత్, సర్వశిక్ష అభియాన్ పథకాల్లో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వీరికి కనీస వేతనం, సమాన పనికి సమానవేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పేదలను ఆదుకోవడం, పౌష్టికాహారం అందించడం, స్ర్తి- శిశు మరణాలను తగ్గించడం విద్యా- వైద్యం అందించడం లక్ష్యాలతో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ పథకాలు నేడు క్రమేపీ నీరు గార్చుతున్నారని తెలియజేశారు. పథకాలకు సరిపడా నిధులు కేటాయించి లక్ష్యాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఈ పథకాలకు నిధులు కోత పెడుతున్నారన్నారు. ఈపథకాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. దీనిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్.హిమప్రభ, కె.సుజాత, జయలక్ష్మీ, లత, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగమణి, ఏ.పద్మావతి, మహాలక్ష్మీ, ఆదిలక్ష్మీ, కళ్యాణి, రాజేశ్వరి, దేవి, రేణుక, సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, టి.తిరుపతిరావు, ఎం.తిరుపతిరావు, ఎం. ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

కొత్త రాజకీయం నూతన నాయకత్వం రావాలి
* లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ
శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: కొత్త రాజకీయ నూతన నాయకత్వం రావాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి బి.వి.రమణమూర్తికి మద్దతిస్తున్నట్లు తెలియజేశారు. లోకసత్తా పార్టీ నాయకులు జయప్రకాశ్‌నారాయణ ఆదేశాల మేరకే మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని రాజకీయ అజెండాగా మార్చేశారన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చెప్పినంత వరకు జిల్లాలో కిడ్నీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు మూత పడుతున్నాయని, చక్కెర కర్మాగారాలు దేశం హయాంలోనే మూతపడ్డాయన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో లోక్‌సత్తా నాయకులు పంచాది రాంబాబు, కె.పోలినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.నాగేశ్వరరావు, అప్పలరాజు, నవీన్, జానకిరామ్ పాల్గొన్నారు.