విజయవాడ

ఎపిసిఆర్‌డిఎ ఓపెన్ ఫోరంలో 26 దరఖాస్తులకు ప్రాథమిక అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో జనవరి 20న శుక్రవారంనాడు నిర్వహించిన ఓపెన్ ఫోరంలో భవనాలు, లేఅవుట్ల దరఖాస్తులను అధికారులు స్వయంగా పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన వారికి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి మంజూరు చేయడం జరిగింది. పారదర్శకంగా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంలో భాగంగా చేపట్టిన ఓపెన్‌ఫోరం నిర్మాణదారులకు సౌకర్యవంతంగా మారింది. అన్ని నిబంధనలు పాటించి, సంబంధిత పత్రాలన్నీ జతచేసి లైసెన్స్‌డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే అనుమతులు సులువుగా మంజూరు అవుతాయని కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ చెప్పారు. విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో జనవరి 20న శుక్రవారంనాడు నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 30 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 26 దరఖాస్తులను అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి పత్రాలు అందించడం జరిగింది. మరో 4 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరడం జరిగింది.
వీటిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 10 దరఖాస్తులు రాగా 8 దరఖాస్తులను అప్పటికప్పుడే క్లియర్ చేసి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీ చేయడం జరిగింది. 2 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరడం జరిగింది. ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం 7 దరఖాస్తులు రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న 6 దరఖాస్తులను అప్పటికప్పుడు ఆమోదించి సర్ట్ఫికెట్లను జారీ చేయడం జరిగింది. 1 దరఖాస్తుకు అదనపు సమాచారం కోరడం జరిగింది. లేఅవుట్ల అనుమతులు కోసం 10 దరఖాస్తులు రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న 10 లేఅవుట్లకు అప్పటికప్పుడే ప్రాథమిక పత్రం మంజూరు చేయడం జరిగింది. పరిశ్రమల అనుమతుల కోసం 3 దరఖాస్తులు రాగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2 దరఖాస్తులను క్లియర్ చేసి ప్రాథమిక అనుమతి మంజూరు చేయడం జరిగింది. 1 దరఖాస్తుకు అదనపు సమాచారం కోరడం జరిగింది. ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ఎపిసిఆర్‌డిఎ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ వి.రాముడు, ప్లానింగ్ ఆఫీసర్ సిహెచ్ వి.సాంబశివరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళా పార్లమెంటు సదస్సులో తెలుగు రుచులు

విజయవాడ, జనవరి 20: విజయవాడలో ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులపాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటు ఏర్పాట్లపై శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. హోటల్ ఐలాపురంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, సలహాదారు రామలక్ష్మితో పాటు ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు, ఎన్‌జివో ప్రతినిధి కాట్రగడ్డ బాబు, రాష్ట్ర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభాపతికి మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య స్వాగతం పలికారు. మహిళా పార్లమెంటుకు 10వేల మంది పైగా హాజరయ్యే అవకాశం వున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేదిక ఎటువైపు ఉండాలి, కూర్చునేవారికి సంబంధించి టెంట్లు, వారికి అందించే సమాచార కిట్లలో ఏమేం ఉండాలనే దానిపై చర్చించారు. పవిత్ర సంగమం వద్ద పనులు చేపడుతున్న ఎవన్స్ సంస్థ ప్రతినిధులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన స్పీకర్ నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఆతిధ్యానికి మారుపేరు అనే విధంగా భోజన ఏర్పాట్లు వుండాలని సూచించారు. తెలుగు రుచులు చూపాలని ఆదేశించారు. తుది మెనూకు ఒకే చెప్పారు. కార్యక్రమం ప్రచారం కోసం కొన్ని పాటలను రూపొందించారు. వాటిని విన్న స్పీకర్ కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. నిడివి విషయంలో జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. అమరావతి వేదికగా కార్యక్రమం జరుగుతున్నందున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మరో మూడువారాలే సమయం వున్నందున అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సభాపతి సూచించారు. రాష్ట్రం నుంచే కాక దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థినులు హాజరవుతున్న దృష్ట్యా వారికి ఉపయోగపడే అంశాలపై చర్చా గోష్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడురోజులపాటు జరిగే ఈ సభలకు దేశవ్యాప్తంగా వున్న 400కు పైగా మహిళా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతి ప్రతిష్టను పెంచేలా కార్యక్రమం వుండాలని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. సమావేశంలో శాసనసభ కార్యదర్శి కోపల్లె సత్యనారాయణరావు, సభాపతి స్పెషల్ ఆఫీసర్ గురుమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ముందస్తు ప్రణాళికతో ప్రకృతి వైపరీత్యాలకు చెక్

విజయవాడ, జనవరి 20: ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. శుక్రవారం నగరంలోని చేసిన సమీక్షా సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ సలోని సిదాన, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తుపాను, సునామి, భూకంపం, రోడ్, ట్రైన్ యాక్సిడెంట్ వంటి విపత్తులు సంభవించినపుడు వాటిని ఎదుర్కొనేందుకు తీరప్రాంతాల్లో పట్టాణాల్లో చేపట్టాల్సిన అంశాలపై అధికారులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుత తరుణంలో శాటిలైట్ ఆధారంగా సునామి, తుపానులు ఎప్పుడు సంభవిస్తాయో ముందుగానే తెలుస్తోందన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు క్షేత్రస్థాయిలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తతతో శిధిలావస్థలో భవనాల్లో ఉన్నవారిని, తీరప్రాంతాల్లో నివశించేవారిని ముందుస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అనేక విపత్తులను ఎదుర్కొన్నప్పటికి వాటిని డాక్యుమెంటేషన్ చేసే ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదన్నారు. ఇటీవల సంభవించిన హుద్ హుద్ తుపాను వలన జననష్టం లేకుండా ఏ విధంగా ఎదుర్కొన్నాం వంటి అంశాలను డాక్యుమెంటేషన్ చేసిన ఆన్‌లైన్ పొందుపరిస్తే భవిష్యత్తు తరాలు వీటిని సునాయాసంగా ఎదుర్కొనేందుకు సమాచారం లభ్యమవుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన పూర్తి డేటాను ఆల్ ఇండియా డిజాష్టరు మేడిగేషన్ ఇన్‌స్టిట్యూట్ సంస్థకు రెండురోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఆల్ ఇండియా డిజాష్టరు మేటిగేషన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి గౌతమ్‌బూట్ వివరిస్తూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి అనే అంశంపై ఫవర్ ఫాయింట్ ప్రెజెంటేషన్ అధికారులకు వివరించారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, విజయవాడ పట్టణాలతో పాటు జిల్లా మొత్తాన్ని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందని ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రణాళికలను మా సంస్థకు పంపినట్లయితే వాటిని డాక్యుమెంటేషన్ చేస్తామన్నారు. విపత్తులు సమయంలో అడవులు కాలిపోవడం, రోడ్, ట్రైన్ యాక్సిడెంట్స్, పరిశ్రమలు, తుపాను వలన మనుషులు, పశువులు మరణించడం, భూకంపాలు వలన భవనాలకు నష్టం వాటిల్లకుండా ఎటువంటి ముందుస్తు చర్యలు చేపట్టాలనేది, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులందరూ తమశాఖలకు సంబంధించి ముందుగానే ప్రణాళికలతో అప్రమత్తులై ఉండాలని సూచించారు. వరదలు, తుపానులు, కరువు వంటి ప్రాంతాలను సంబంధిత శాఖాధికారులు ముందుగానే గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య, ఆర్డీవోలు సాయిబాబా, చక్రపాణి, జెడ్పీ సిఇవో టి.దామోదరనాయుడు, వ్యవసాయశాఖ జెడి నరశింహారావు, సిపివో రత్నాకరబాబు, ఇడి ఎస్‌సి కార్పొరేషన్ సత్యనారాయణ, విజయవాడ అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, ఎఐడియంఐ ప్రతినిధులు జి.్భర్గవ్, అమల్‌నాథ్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.