విశాఖ

గౌరమ్మకు మొక్కులు తీర్చుకున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జనవరి 21: స్థానిక వేల్పుల వీధి గౌరీపరమేశ్వరుల జాతర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది. తెల్లవారు ఐదు గంటల నుండే స్థానిక మెయిన్‌రోడ్డులోని గౌరీపరమేశ్వరుల అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, డిఎస్పీ పురుషోత్తం, ఆర్డీవో ప్రభావతి, తహశీల్దార్ కృష్ణమూర్తి, టౌన్ సిఐ విద్యాసాగర్ తదితర ప్రముఖులు ఉన్నారు. పలువురు భక్తులు అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు. జాతర సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి అమ్మవారి రథోత్సవం ప్రారంభమయింది. ఎమ్మెల్యే సతీమణి విజయలక్ష్మి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల నుండే వివిధ నేలవేషాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలతో రథయాత్ర ప్రారంభమయింది. నూకాంబిక అమ్మవారి ఆలయం తరపున అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు పట్టువస్త్రాలను ఇతర సారెను తీసుకువచ్చి సమర్పించారు. పులివేషాలు, తప్పెడగుళ్లు, కాళికాదేవి వేషాలు ఇతరత్రా జానపద, సాంస్కృతిక నృత్యరూపకాలతో జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. సాయంత్రం ఐదు గంటల నుండే జిల్లా నలుమూలల నుండి వచ్చిన అనూహ్య జనవాహినితో పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మాల నాగేశ్వరరావు, కమీటీ సభ్యులు దోమరౌతు రామారావు, వాకాడ కోటి, బొద్దపు ప్రసాద్, గొర్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి పార్కు అభివృద్ధికి రూ. 5 లక్షలు
కెడి పేట, జనవరి 21: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చారిత్రక ప్రదేశాలున్న కృష్ణదేవీ పేట అల్లూరి పార్కు అభివృద్ధికి రాష్ట్ర సంఘాల నుండి ఐదు లక్షల రూపాయలు అందిచనున్నామని క్షత్రియ ఫెడరేషన్ చైర్మన్ దాట్ల రమేష్ తెలిపారు. ఆలిండియా క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్షుడు రాఘవరాజు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజుల అధ్వర్యంలో ప్రతి క్షత్రియ సంఘాల ప్రతినిధుల బృందం శనివారం కృష్ణదేవీపేటలో ఉన్న అల్లూరి పార్కును సందర్శించారు. పార్కులోని అల్లూరి సమాధికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అల్లూరి చరిత్రను తెలియజేసే స్మారక మందిరం, పార్కు ప్రదేశాలను సందర్శించారు. అనంతరం ఫెడరేషన్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి చరిత్ర చిరస్మరణీయమన్నారు. చారిత్రక చిహ్నాలను ప్రభుత్వం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర సీనియర్ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఇక్కడ అల్లూరి పార్కు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేసి, లక్షల రూపాయలతో అభివృద్ధి పరచటం ఆయన కృషికి రాష్ట్ర క్షత్రియ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్కు అభివృద్ధిని పర్యాటక శాఖకు అప్పగించి, భావితరాలకు గుర్తుండిపోయేలా అభివృద్ధి చేయాలని సంఘ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి స్థానికులు, ప్రజా ప్రతినిధులు, మంత్రి అయ్యన్నపాత్రుడు చేస్తున్న కృషిని అన్ని వర్గాలు హర్షించవలసిందేనన్నారు. ఈ పర్యటనలో క్షత్రియ సంఘ సభ్యులు సుబ్బరాజు, పెదబాబు, జానకిరామరాజు, మురళీధర్‌తోపాటు డివిఎస్ ప్రసాద్‌రాజు, పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.