అంతర్జాతీయం

ఎవరీ డొనెల్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ మాటకు ఎదురుండదని అందరూ భావించారు. చెప్పినవన్నీ చేసి చూపించేదాకా ఆగేది లేదని అధికార పగ్గాలు చేపట్టన వారం రోజుల్లోనే ట్రంప్ స్పష్టమైన సంకేతాలిచ్చారు కూడా. అదే సమయంలో ఓ మహిళా న్యాయమూర్తి ఆయనకు ఝలక్ ఇచ్చారు. అమెరికాలో న్యాయ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ఆయనకు తెలియజెప్పారు. ఆ మహిళా జడ్జే ఆన్ ఎం డొనెల్లీ. ఏడు ముస్లిం దేశాలనుంచి శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధిస్తూ ట్రంప్ శుక్రవారం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను ఆమె తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అమెరికా పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన అపీలును అత్యవసరంగా విచారించిన డొనెల్లీ ఈ ఉత్తర్వుల కారణంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అదుపులోకి తీసుకున్న శరణార్థులను వారి స్వదేశాలకు తిప్పి పంపవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు తన పనేదో తాను చేసుకు పోతూ, ప్రచారార్భాటానికి దూరంగా ఉన్న డొనెల్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నారు. తన ఉత్తర్వులద్వారా అధ్యక్షుడైనా సరే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తెలియజెప్పారని అన్ని వర్గాలవారు డొనెల్లీని ప్రశంసిస్తున్నారు.
మిచిగాన్ రాష్ట్రంలోని రాయల్ ఓక్ ప్రాంతానికి చెందిన డొనెల్లీకి న్యాయ శాస్త్రంలో మంచి అనుభవం ఉంది. ఆమె నాటర్‌డామ్ యూనివర్శిటీనుంచి గ్రాడ్యుయేషన్, ఓహియో కళాశాలనుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. రైట్ స్టేట్ యూనివర్శిటీలో పదేళ్ల పాటు ప్రొఫెసర్‌గా పని చేశారు. ఫెడరల్ జడ్జిగా పని చేయడానికి ముందు ఆమె పాతికేళ్లు న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసులో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. గృహహింస, బాలలపై నేరాల విచారణ విభాగంలో బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. 2015లో డెమోక్రటిక్ సెనేటర్ చక్ షూమర్ సిఫారసుపై డొనెల్లీని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫెడరల్ జడ్జిగా నియమించారు. ఆమె నియామకాన్ని సెనేట్ 95-2 ఓట్ల మెజారిటీతో ధ్రువీకరించడాన్ని బట్టే ఆమె ఎంతటి నిక్కచ్చి మనిషో అర్థమవుతుంది.