చెన్నయ్ చైత్రమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్ కల్యాణ్ మూవీ మేకర్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అక్షయ్ కూరపాటి, దివ్య, ప్రవల్లిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చెన్నయ్ చైత్రమా..’. కమల్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ జరిగింది. నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ టైటిల్ లోగోను ఆవిష్కరించారు. హీరోలు సూర్య శ్రీనివాస్, అక్షయ్ మాట్లాడుతూ, ఓ మంచి లవ్‌స్టోరీని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా చేస్తున్నామన్నారు. దివ్య, ప్రవల్లిక మాట్లాడుతూ, టైటిల్ నుంచి, ప్రతిపాత్రను కూడా దర్శకుడు కల్యాణ్ బాగా డిజైన్ చేశారన్నారు. దర్శక, నిర్మాత కమల్ కల్యాణ్ మాట్లాడుతూ, మంచి కథతో కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాగా ‘చెన్నయ్ చైత్రమా’ తెరకెక్కిచ్చామని, ఉన్నదాంతోనే మనం సంతృప్తి పొందాలన్న కానె్సప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని, ఎక్కడా అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని’ అన్నారు.