ప్రారంభమైన రాజా ది గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనీల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’ (వెల్‌కమ్ టు మై వరల్డ్). రవితేజ, కథానాయిక మెహరీన్‌లపై ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్‌రామ్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- భద్ర సినిమా తరువాత తమ సంస్థలో రవితేజ నటిస్తున్నాడని, సుప్రీమ్ సినిమా తరువాత అనీల్ రూపొందిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ సాధిస్తుందని తెలిపారు. వైవిధ్యమైన కథతో రవితేజ ఓ విలక్షణమైన పాత్రతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఆయన అభిమానులకు నచ్చేలా చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి సమర్పణ:దిల్ రాజు, నిర్మాత:శిరీష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అనిల్ రావిపూడి.