అదిలాబాద్

ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 13: ప్రతి ప్రజాఫిర్యాదుల విభాగంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాలపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారి నుండి ఆర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికతోవిన్న కలెక్టర్ పరిష్కారానికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అధికారులు ప్రజాఫిర్యాదుల విభాగానికి పక్కా సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ప్రజల సమస్యలపై ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. గత గ్రీవెన్స్ సెల్‌లో పరిష్కరించిన ఆర్జీల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆయా మండలాలకు చెందిన వారి నుండి 150 దరఖాస్తులను స్వీకరించారు. కళ్యాణలక్ష్మి కింద డబ్బుల కోసం సిర్పూర్‌కు చెందిన మానెపల్లి రమేష్, వికలాంగుల పింఛను కోసం వాంకిడికి చెందిన గణపతి, సాగుచేసుకుంటున్న భూమిలో బోర్ మంజూరీ చేయాలని జైనూర్ మండలం అందుగుడకు చెందిన జాదవ్ గణపతి కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. రెబ్బన మండలం కొండపల్లికి చెందిన బోదకాల్ల బారిన పడ్డ బాధితులు ఆసరా పింఛను కోసం కలెక్టర్‌ను ఆశ్రయించారు. తాను సాగుచేసుకుంటున్న బెజ్జూర్ మండలం గుడెంలోని 167/5 సర్వేనంబరు భూమి హక్కు పత్రాలు ఇప్పించాలని రాజయ్య వినతి పత్రం సమర్పించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో భూమిని కోల్పోతున్న తనకు పరిహారం ఇప్పించాలని చింతన మానెపల్లి మండలం టేకం గుడకు చెందిన జీలపల్లి బొందక్క కలెక్టర్‌కు అర్జీసమర్పించారు. డబుల్ బెడ్ రూం ఇంటి కోసం ఆసిఫాబాద్ మండలం జనకాపూర్‌కు చెందిన కడం శ్రీలత కోరారు. ఈగ్రీవెన్స్‌డేలో గ్రామీణాభివృధ్ది అధికారి శంకర్, ప్రణాళికాధికారి కృష్ణయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు బిజెపి పక్షనేత కిషన్‌రెడ్డి రాక
నిర్మల్, ఫిబ్రవరి 13: నిర్మల్ నియోజకవర్గంలోని ప్రాణహిత చేవెళ్ల హైలెవల్ కెనాల్ పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్‌మాట్ బ్యారేజి ఆయకట్టు రైతులకు భరోసా ఇవ్వడానికి భారతీయ జనతాపార్టీ శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి మంగళవారం మామడ, దిలావర్‌పూర్ మండలాల్లో పర్యటించనున్నట్లు గోదావరి, కృష్ణ జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడుతూ గతంలో బ్యారేజి నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు బిజెపి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికి ప్రభు త్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బిజెపి పక్షనేత రైతులకు అండగా ఉండటానికి వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిసెల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మరాజు, కార్యదర్శులు రచ్చ మల్లేష్, నరేందర్, అసెంబ్లీ కన్వీనర్ సామ రాజేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు నాయుడి మురళి, శివరాం, శశిరాజ్‌వర్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.