అంతర్జాతీయం

హిందూ వివాహ బిల్లుకు పాక్ సెనేట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: పాకిస్తాన్‌లో హిందూ వివాహాల నియంత్రణ బిల్లు చట్టంగా మారేందుకు రంగం సిద్ధమైంది. దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక బిల్లును పాక్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్ దిగువ సభ) 2015 సెప్టెంబర్ 26నే ఆమోదించిన ఈ బిల్లు ఇక చట్టంగా మారాలంటే దానిపై ఆ దేశ అధ్యక్షుడు లాంఛనంగా సంతకం చేస్తే సరిపోతుంది. పాక్‌లోని హిందువులకు ఈ బిల్లు ఎంతో ఆమోదయోగ్యంగా ఉందని, హిందువుల వివాహాలు, వివాహాల రిజిస్ట్రేషన్లు, విడాకులు, పునర్వివాహాలకు సంబంధించిన ఈ బిల్లులో కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్దేశించడం జరిగిందని ‘డాన్ న్యూస్’ వార్తా సంస్థ పేర్కొంది. పాకిస్తాన్‌లో అల్ప సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు ఇదే తొలి వివాహ చట్టం. పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రాల్లో అమలయ్యే ఈ చట్టం అక్కడి హిందూ మహిళలు తమ వివాహాలకు డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలను పొందేందుకు దోహదపడుతుంది.