ఐటెం సాంగ్‌లో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగులో రెండు మూడు హిట్ సినిమాలు చేసి ఈమధ్య అవకాశాలు బాగా తగ్గిన హాట్ భామ ఇషాచావ్లా ఇప్పుడు ఐటెం భామగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో ఐటెం సాంగ్‌కి రెడీ అయింది. ‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన ఇషాచావ్లా, ‘పూలరంగడు’, ‘మిస్టర్ పెళ్లికొడుకు’ వంటి హిట్ చిత్రాలతో మంచిమార్కులు కొట్టేసింది. గ్లామర్‌పరంగా యూత్ నుంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ సుందరి, వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో తెరమరుగైన ఆమె, తాజాగా ‘సుప్రీమ్’ సినిమాలో ఒక ఐటెమ్ పాటకు ఓకే చెప్పేసింది. ఇటీవల ఆమెపై ఈ పాటను చిత్రీకరించారు. సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాకి అనీల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.