శ్రీకాకుళం

షట్టర్ల కుంభకోణంలో సిఐడి దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, మార్చి 23: జిల్లాలో సంచలనం రేకెత్తించిన షట్టర్ల కుంభకోణంలో భాగంగా మండల కేంద్రంలోని వంశధార కాలనీవద్ద ఉన్న షట్టర్లను సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. గురువారం సిఐడి డిఎస్పీ వెంకటరత్నం, సిఐ నీలయ్య, విజయకుమార్ షట్టర్ల నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా డిఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ 2006లో షట్టర్ల కుంభకోణం వెలుగు చూసిందని, తరువాత దీనిపై విచారణకు విజిలెన్స్‌కు ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. గత రెండేళ్ల కిందట ఈ కేసును ప్రభుత్వం సిఐడికి బదలాయించినట్లు ఆయన చెప్పారు. ఈ దిశగానే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా గురువారం చిన్నతుంబయ్యపేట, పాలసీమ, హిరమండలం తదితర ప్రాంతాల్లో పరిశీలించామని ఆమె స్పష్టంచేశారు.

స్టేడియం నిర్మాణానికి ఉద్యమించాలి
* మాజీ మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, మార్చి 23: తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందే తప్ప ఆచరణలో ఎటువంటి అభివృద్ధి పనులు కానరావడం లేదని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నగర కేడర్‌తో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. స్టేడియంను కూల్చివేసి ఎటువంటి నిర్మాణాలు నేటివరకు చేపట్టడం లేదని, స్టేడియం నిర్మాణానికి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. స్టేడియం నిర్మాణానికి చేపట్టే ఉద్యమంలో అన్ని సంఘాల నాయకులను భాగస్వాములను చేయాలన్నారు. జాతీయ క్రీడలు జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పటికీ ఆ పరిస్థితి కానరావడం లేదన్నారు. పట్టణంలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. స్టేడియం నిర్మాణానికి చేపట్టే ఉద్యమం ఆదివారం రెండవ పూట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో అన్ని సంఘాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, మాజీ కౌన్సిలర్ అంధవరపు సూరిబాబు, నగర అధ్యక్షుడు సాదు వైకుంఠరావు, గుమ్మానగేష్, మండవిల్లి రవి, చల్లా రవికుమార్, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, ధర్మాన రఘునాథమూర్తి, కోరాడ రమేష్, ఎన్ని ధనుంజయరావు, యజ్జల గురుమూర్తి పాల్గొన్నారు.