శ్రీకాకుళం

టి.బి రహిత జిల్లాగా రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లాను టి.బి రహిత జిల్లాగా రూపొందించే గురుతర బాధ్యత నర్సింగ్ కళాశాల విద్యార్థులపై ఉందని జెసి-2 పి.రజనీకాంతారావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వివిధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో సమావేశంలో ముఖ్య అతిధిగా మాట్లాడారు. నాగరిక సమాజంలో కూడా టి.బి వ్యాధిగ్రస్తులు సక్రమంగా మందులు వాడకపోవడం శోచనీయమన్నారు. వైద్యులు సూచించిన మందులు 8,9 నెలలపాటు సక్రమంగా వేసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వ్యాధి నిర్మూలన జరుగుతుందన్నారు. జిల్లాలో టి.బి. లెప్పరసీ వ్యాధులు అధికంగా ప్రబలడం శోచనీయమన్నారు. ప్రజలకు టి.బిపై పూర్తి అవగాహన కలిగించి ఇటువంటి దినోత్సవం నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత లేని రోజు రావాలని తెలిపారు. జిల్లా టి.బి నివారణ అధికారి ధవళ భాస్కరరావు మాట్లాడుతూ మనదేశంలోనే ఈ వ్యాధి బారిన ఎక్కువమంది పడుతున్నారని, మందుల వాడకంపై అవగాహన లేమితోనే ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. బరువు తగ్గడం, ఆకలి మందగించడం లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే కెల్ల పరీక్ష చేయించుకోవాలని, వ్యాధి నిర్థారణ అయినట్లయితే 8,9 నెలలపాటు వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా మందులు వాడితే తప్పక నయం అవుతుందన్నారు.
అనంతరం సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఒకరోగిని పరిరక్షించుకోకపోతే సమాజం మొత్తం జబ్బు పడుతుందన్నారు. ఈవ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు, మందులను ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ముందుగా డాక్టర్ హుక్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యాధికారి ఎస్.చలమయ్య, డాక్టర్ కిరణ్‌కుమార్‌లకు, సూపర్‌వైజర్లకు, స్టాటిస్టికల్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నీషియన్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్‌ఓ తిరుపతిరావు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ వెంకటేశ్వరరావు, మెండ ప్రవీన్, రత్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

చట్టంతో విభేదించే పిల్లల కేసులను
త్వరితగతిన పూర్తి చేయాలి
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యామలాదేవి
శ్రీకాకుళం(రూరల్), మార్చి 24: చట్టంతో విబేధించే పిల్లల కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యామలాదేవి చెప్పారు. శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బాలల సంరక్షణ సమితి జువెనల్ జస్టిస్‌బోర్డు, శాంతినగర్ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల రక్షణ, చట్టాలపై పాఠశాల, కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి వారిలో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు వారి గృహంలో ఏవిధమైన రక్షణ ఉంటుందో అదే విధంగా పరిశీలనా గృహంలో ఉంటుందన్నారు. 6 నుండి 15 సంవత్సరం పిల్లలందరూ ఖచ్చితంగా నిర్బంధ విద్యను పొందాలని, వీధి బాలల సంరక్షణ, బాలలు పనికి వెళ్లడం నిషేధించాలన్నారు. పిల్లల కేసులు విచారణ చేసినప్పుడు వారికి వచ్చే భాషల్లోనే విచారణ చేపట్టాలన్నారు.వీధుల్లో తిరుగుతున్న పిల్లలు, తల్లి, తండ్రి లేని పిల్లలను చిన్న చిన్న నేరాలు చేసిన వారు ఇంటి నుండి పారిపోయే వారిని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుగా గుర్తించాలన్నారు. బాలల హక్కులకు బాలలకు స్నేహపూర్వక న్యాయ సహాయం ఇస్తున్నట్లు తెలిపారు. జువనైల్ జస్టిస్‌బోర్డు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కె.నాగమణి మాట్లాడుతూ జిల్లాలో 47పోలీస్‌ష్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 19 ఉన్నాయన్నారు. జువనైల్ జస్టిస్ చట్టం అమలుకు సహకరించాలని కోరారు. చైల్డ్‌వెల్‌ఫేర్ కమిటీ అధ్యక్షులు పి.సన్యాసప్పారావు మాట్లాడుతూ స్కూల్స్, కళాశాలలలో చట్టంపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓ విఎల్ సత్యనారాయణ, పరివర్తనాధికారి రమణ, బాలల పరిరక్షణ అధికారి మాట్లాడారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పేనల్ న్యాయవాధులు, పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు.