అంతర్జాతీయం

గ్రిల్లోట్‌కోసం లక్ష డాలర్లు సేకరించిన భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, మార్చి 26: ఒక భారతీయుడిని కాపాడడానికి, కాల్పులను ఎదుర్కొని గాయపడిన 24 ఏళ్ల అమెరికన్‌ను అమెరికాలోని భారతీయులు ‘నిజమైన అమెరికన్ హీరో’గా గౌరవించడంతోపాటుగా తన స్వస్థలమైన కాన్సాస్‌లో ఇల్లు కొనడం కోసం అతనికి సాయం చేయడానికి లక్ష డాలర్ల విరాళాలను కూడా సేకరించారు. కాన్సాస్‌లోని ఒక బార్‌లో గత నెల భారతీయులను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపిన నేవీ మాజీ ఉద్యోగిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఘటనలో ఇయాన్ గ్రిల్లోట్ అనే అమెరికన్ యువకుడు గాయపడ్డం తెలిసిందే. కాగా, ఇక్కడి ఇండియన్ హౌస్ హ్యూస్టన్ 14వ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రిల్లోట్‌ను అమెరికాలోని భారతీయులు ‘నిజమైన అమెరికన్ హీరో’గా అభివర్ణిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల అనే తెలుగు యువకుడు మృతిచెందగా, అతని స్నేహితుడు అలోక్ మేడసాని తీవ్రంగా గాయపడ్డం తెలిసిందే. హ్యూస్టన్‌లోని భారతీయ సంతతి వారి తరఫున ఇండియన్ హౌస్ అతని నిస్వార్థ చర్యను గుర్తించిందని, ఇల్లు కొనడంకోసం గ్రిల్లోట్‌కు సాయం చేయాలని నిర్ణయించినట్లు సంస్థ ఫేస్‌బుక్ పేజిలో ఉంచిన ప్రకటన పేర్కొంది. హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే మద్దతతో ఇండియా హౌస్ ఇయాన్ తన సొంత పట్టణంలో ఇల్లు కొనుగోలు చేసేందుకు లక్ష డాలర్ల విరాళాలను సేకరించిందని కూడా ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఇయాన్‌కు లక్ష డాలర్ల చెక్‌ను అందజేశారు.

చిత్రం.. కాన్సాస్ కాల్పుల్లో గాయపడి కోలుకున్న అలోక్ మేడసానితో కాల్పులకు దిగిన వ్యక్తిని అడ్డుకోబోయన ఇయాన్ గ్రిల్లోట్