అదిలాబాద్

బడి ఈడు పిల్లలను బడిలో వంద శాతం చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 27: జిల్లాలో ఏప్రిల్ 3 నుండి 13 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో బడి ఈడు పిల్లలను వందశాతం మేరకు పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను వందశాతం బడులలో చేర్పించాలన్నారు. బడివదిలివేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలన్నారు. ఏప్రిల్ 3 నుండి 13 వరకు నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ప్రతీపాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాల యొక్క విశిష్టతలకు సంబంధించిన కరపత్రాలను ముద్రించి పిల్లల తల్లితండ్రులకు పంపిణి చేసి పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. పాఠశాలల్లో సాధించిన ప్రగతి, ఫలితాలు, సదుపాయాలు, మొదలగు విషయాలపై ప్రొఫైల్ తయారుచేయాలన్నారు. పాఠశాల వదిలేసిన పిల్లలు, పాఠశాలలో నమోదు, డ్రాపౌట్స్, బాలకార్మికులు మొదలగు తమ పాఠశాల పరిధిలోని అందరి వివరాలను తయారుచేయాలన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారిణి ప్రణీత మాట్లాడుతూ ఏప్రిల్ 3న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లితండ్రులు, సర్పంచ్, వార్డు సభ్యులు, ఎస్‌ఎంసి సభ్యులతో పాఠశాలల్లో పిల్లల నమోదుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 4న పాఠశాల వదిలేసిన పిల్లల తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే ఏప్రిల్ 6,7,10వ తేదిల్లో ప్రధానోపాధ్యాయులు, ఎస్ ఎంసి సభ్యులు, ఉపాధ్యాయులు, యువకులు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహణ, హరితహారం పథకం కింద మొక్కలను నాటడం, పాఠశాలల పరిశుభ్రత, మొక్కల రక్షణ, మొదలగువాటిపై సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 11న బాలకార్మికుల జాబితా తయారుచేసి కార్మికులుగా పెట్టుకున్న యజమానులతో ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసి సభ్యులు సమావేశమై పిల్లలను పనిలోనుండి విడుదల చేసి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అలాగే ఏప్రిల్ 12న స్వచ్ఛ పాఠశాలల్లో భాగంగా పాఠశాలల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 13న పిల్లల నమోదు చివరి జాబితా తయారుచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నగేష్, డిఎంఅండ్‌హెచ్‌వొ జలపతినాయక్, డిపివొ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ వెరిపికేషన్ పూర్తి
* జిల్లా ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, మార్చి 27: ఇటీవలే జిల్లాలో నూతనంగా ఎంపికైన 543 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు, జాబ్‌వెరిఫికేషన్ ప్రక్రీయ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ఈనెల 13 నుంచి రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.అశోక్ అధ్వర్యంలో డాక్టర్ల బృందం 543మంది అభ్యర్థులకు ఈనెల 22న పూర్తికాగా, పోలీసు స్పెషల్ బ్రాంచ్ అధికారి బి.ప్రవీణ్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా బృందం సభ్యులు అభ్యర్థుల నివేదికను సిద్దం చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు జాబ్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎస్‌కె తాజోద్దిన్ అధ్వర్యంలో జరగగా ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ నుండి 140మంది, మంచిర్యాల నుండి 247, నిర్మల్ 94, కుమురంభీం ఆసిఫాబాద్ నుండి 62మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ కేంద్రాలతో పాటుతేదీలు ఖరారు చేస్తారని సూచించారు. కానిస్టేబుళ్ళ ఎంపిక ముఖ్యమైన ఘట్టం జాబ్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినందుకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, ఉద్యోగ పరిశీలన అధికారి ఎస్‌కె తాజోద్దిన్, విష్ణు, విఠ్ఠల్, ఎస్.ప్రేంసింగ్‌లను అభినందించారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో డాక్టర్స్ బృందం డాక్టర్ తిప్పస్వామి, ఇద్రిస్ అక్బాని, సత్యనారాయణ తదితర డాక్టర్లను శిక్షణ కేంద్రం డిఎస్పీ కె.సీతారాములు, ఎస్సైలు పి.గంగాధర్, విష్ణుప్రకాష్, పోలీసు డాక్టర్ సిఆర్ గంగారాం అభినందించారు.