విశాఖ

సీలేరులో కార్చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 27: గత రెండు, మూడు రోజుల నుంచి సీలేరు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత రెండు రోజుల నుంచి 41 నుంచి 42 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు వేడి గాలులు వీస్తుండడంతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీంతో పాటు అటవీ ప్రాంతంలో ఎండ వేడిమికి మంటలు రావడంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పక్షులు సీలేరు నదీ తీరం వద్ద సేద తీరుతున్నాయి. మునుపెన్నడూ ఇటువంటి ఎండలు చూడలేదని పలువురు చెబుతున్నారు.

విచ్చలవిడిగా బెల్టుషాపులు
ఏరులై పారుతున్న మద్యం
అనకాపల్లి(నెహ్రూచౌక్), మార్చి 27: జాతీయ రహదారికి 500మీటర్లు లోపు మద్యం దుకాణాలు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 500మీటర్ల లోపల ఉన్న దుకాణాలను ఈ నెల 31వ తేదీలోపు తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మద్యాన్ని ఎంఆర్‌పి ధరలకే అమ్మాలని కూడా వ్యాపారులకు ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే ఎంఆర్‌పి అమ్మకాలకు స్వస్తిపలికి అదనంగా క్వార్టర్ బాటిల్‌పై 10 నుంచి 15 వరకు మందుబాబులు వద్ద వసూలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మద్యం దుకాణాలు సమీపంలో ఉన్న పాన్‌షాపులు, టీ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన మార్గంలోనే స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఉన్న పాన్‌షాపులు నుంచి కొత్తూరు శారదానగర్, కాలేజి జంక్షన్ వరకుప్రతీ పాన్‌షాపులతోపాటు అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.ఒక్కో షాపులో అన్ని బ్రాండ్‌లు కలిపి ఐదు కేసులు వరకు మందు బాటిళ్లు స్టాక్ ఉంటున్నాయి. స్వయాన రూరల్ పోలీస్టేషన్ సమీపంలో ఉన్న దుకాణాలు పగలు టిపిన్ సెంటర్లు రాత్రులు మద్యం దుకాణాలుగా దర్శనమిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులకు మద్యం వ్యాపారులు ఇస్తున్నా నెల వారి ముడుపులు మత్తులోఉండడంతో దాడులు చేసిన సంఘటనలు కానరాలేదు. ప్రభుత్వం అనుమతి తీసుకున్న మద్యం దుకాణం ఒక్కటి ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్‌షాపులకు ఆక్కడి నుండే కొనుగోలు చేసి అదనంగా క్వార్టర్ బాటిల్‌పై మరో పది రూపాయలు పెంచి అమ్మతున్నాట్లు సమాచారం. ఒక్కోషాపులో రోజుకు సగటున మూడు నుంచి ఐదు కేసులు మందు అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. జాతీయ రహదారికి 500మీటర్లులోపు మద్యం దుకాణం ఉండకూడదన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ తోలగించిన దుకాణం వద్ద మరో పది పాన్‌షాపుల్లో కావలసిన బ్రాండ్, అవసరమైనంత మందు దొరుకుతుందని చెప్పవచ్చు. దింతో పట్టణంలో ఏ పాన్‌షాపులో చూసినా మద్యం బాటిళ్లు లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు మద్యం వ్యాపారులకు అండగా నిలుస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.