శ్రీకాకుళం

పెళ్లి చేసుకో అన్నందుకే బాలిక హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మార్చి 31: మండలంలోని కుశాలపురం ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న పైడి హారతి(14) అనే మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె.బ్రహ్మారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేసన్‌లో శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 21వతేదీన 12:30 నుండి 4:30గంటల మధ్య హారతి అత్యాచారం, హత్యకు గురైంది. ఈ విషయాన్ని ఆమె తల్లి పైడి లక్ష్మీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో విచారించగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కోరాడ గోవింద్‌తో గత రెండేళ్లుగా పరిచయం, శారీరక సంబంధం ఉంది. ఇటీవల మృతురాలు హారతి పెళ్లి చేసుకోమని లగేజీ ఆటో నడుపుకొంటూ ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్న గోవింద్‌పై ఒత్తిడి పెంచింది. పెళ్లి నుంచి తప్పించు కునేందుకు స్థానికంగా ఉంటున్న గురుగుబెల్లి యతిరాజులతో హారతిని చంపించాలని గోవింద్ పథకం రచించాడని ఎస్పీ వివరించారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో హారతిని 21న గోవింద్ శారీరకంగా అనుభవించిన తరువాత యతిరాజులను హత్య చేయాలని పురమాయించినట్లు విచారణలో అంగీకరించారని ఎస్పీ పేర్కొన్నారు. యతిరాజులు గోవింద్‌తో పెట్టుకున్న ఒప్పందం మేరకు పూటుగా మద్యం సేవించి ఒంటరిగా ఉన్న హారతి ఇంటికి వెళ్లి తాడుతో మెడకు బిగించి హతమార్చాడు. అక్కడితో ఆగకుండా మృతదేహంతోనే సంభోగం చేసి అక్కడ నుండి పలాయనం చిత్తగించినట్లు పోలీసులు విచారణలో యతిరాజులు వెల్లడించాడని ఎస్పీ వివరించారు. మైనర్‌బాలికను దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసిన గోవింద్, యతిరాజులపై 302,376,4 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం డిఎస్పీ కె.్భర్గవరావునాయుడు, సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ సందీప్‌కుమార్ ఉన్నారు.

పల్స్‌పోలియోకు విస్తృత ఏర్పాట్లు
* డిఎంహెచ్‌ఓ తిరుపతిరావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 31: జాతీయ పల్స్‌పోలియోలో భాగంగా రెండవ విడత కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వతేదీన ఆదివారం నిర్వహించేందుకు జిల్లా అంతటా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి సనపల తిరుపతిరావు తెలిపారు. డిఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,39,115మంది ఉన్నారని, 1617 కేంద్రా ల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. 3,4వ తేదీల్లో ఇంటింటా తప్పిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. గిరిజన ప్రాంతాల్లో 325, పట్టణ పరిధిలో 113, గ్రామీణ ప్రాంతాల్లో 1179 కేంద్రాల్లో ఈ చుక్కలు వేసి ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 3.65లక్షల డోసులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. 7712మంది సిబ్బందితో 53 ట్రాన్సిట్‌బూత్‌లు, 76 మొబైల్ బృందాలు, 161మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి బగాది జగన్నాధరావు మాట్లాడుతూ మొబైల్‌టీమ్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంచార జాతుల పిల్లలకు ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నవారు, నిర్మాణ సంస్థలు, పండ్ల తోటల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
అన్నిరైల్వే, బస్‌స్టేషన్లు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, సంతలు, జాతర ప్రయాణాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు 53 బృందాలను నియమించామన్నారు. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత పడక ముందే ఉదయానే్న తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వోలు వెంకటేశ్వరరావు, జి.రత్నకుమారి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ నాయక్ పాల్గొన్నారు.