S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవి ‘గబ్బిలం పూలు’!

సాధారణంగా పుష్పాలు తెలుపు సహా విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తాయి కదా!. కానీ ఇక్కడ కనిపిస్తున్న పూలు నల్లగా ఉన్నాయి కదూ!. 12 అంగుళాల వ్యాసార్థంతో ఉండే ఈ పూలకు 24 అంగుళాల పొడవుంటే మీసాల్లాండి కేసరాలు ప్రత్యేక ఆకర్షణ. వెడల్పుగా ఉంటే దళాలతో కన్పించే ఈ నల్లని పూలు గబ్బిలాల మాదిరిగా ఉండటం చేత వీటిని ‘బ్లాక్ బాట్ ఫ్లవర్’ అని పిలుస్తారు. వీటిలో తెల్లని రకమూ ఉన్నాయి. వాటిని వైట్‌బాట్ ఫ్లవర్ అని పిలుస్తారు. థాయ్‌లాండ్, మలేసియా, దక్షిణ చైనా, ప్రత్యేకించి యున్నన్ ప్రావిన్స్‌లో ఇవి పూస్తాయి.

ఎస్.కె.కె.రవళి

వీటికి శుభ్రత ఎక్కువే!

వీసిల్స్ కుటుంబానికి చెందిన ‘బడ్జర్’లకు శుభ్రత ఎక్కువ. యుకె, ఉత్తర అమెరికా, కొన్ని ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే ఇవి నివసించే బొరియల్లో మలమూత్ర విసర్జన చేయవుగాక చేయవు. ఆహారాన్ని కూడా గుహలో తినవు. ఎప్పటికప్పుడు అవి నివాసాన్ని శుభ్రం చేసుకుంటూంటాయి. మలమూత్రాలు గుహ బయటే చేస్తాయి. నివాస ప్రాంతాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాయంటే సంవత్సరాల తరబడి, తరతరాల తరబడి ఒకే బొరియను నివాసంగా వాడుకునేలా ఎప్పటికీ కొత్తగా ఉండేట్లు నిర్వహిస్తాయి. కొన్ని దేశాల్లో వీటి బొరియలు టూరిస్టు స్పాట్‌లుగా మార్చారుకూడా. బ్రిటన్, అమెరికాల్లో ఒకప్పుడు బడ్జర్ మాంసాన్ని తినేవారు. రష్యాలో ఇప్పటికీ ఆ అలవాటు ఉంది.

ఎస్.కె.కె.రవళి

పెద్దల మాట

బలాఢ్యుడవై, ధైర్యశాలివై నిలబడు.. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో
నీ విధికి నీవే విధాతవని తెలుసుకో - స్వామి వివేకానంద

అబ్బ.. ఎంత బాగుందో!

ఐస్ ముక్కను నాకుతూ చల్లదనాన్ని తన్మయత్వంతో ఆస్వాదిస్తున్న మర్కటం ముచ్చటగొలుపుతోంది కదూ!. మరోవైపు చేతిలోని ఆహారాన్ని మరో కోతి ఇష్టంగా తింటోంది కదూ! థాయ్‌లాండ్‌లో ఖేమెర శకం, అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్లనాటి శిథిల ఆలయం ఫ్రాప్రంగ్ శమ్‌యాట్‌లో ఏటా కోతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. దాదాపు 2వేల కిలోల పళ్లు, ఇతర తినుబండారాలు వాటికోసం అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇటీవలే అక్కడ నిర్వహించిన విందులో ఓ రెండు మర్కటాలు ఇలా కన్పించాయన్నమాట!

భారతి

ఖననంలోనూ కళ

ఇసుకలో పూడ్చివేసిన ఖడ్గమృగం కాళ్లు, కొమ్ము కన్పిస్తున్నాయి కదూ. నిజానికి ఇది నిజమైన ఖడ్గమృగం కాదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్రతీరంలో ఓ కళాకారుడు ఇలా ఓ ఖడ్గమృగం ప్రతిమను ఇసుకలో పూడ్చివేసిన చందాన తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ కళాఖండం ఓ పెద్ద ఆకర్షణ.

భారతి

డ్రీమ్ లైనర్!

ఓ విమాన చక్రంలో విభ్రాంతి కలిగే భంగిమతో కన్పిస్తున్న ఈమె పేరు ఓల్గా మర్చెన్‌కోవా. పాశ్చాత్య నృత్యరీతిలో పెట్టిందిపేరైన ఈమె మంచి మోడల్‌గానూ పేరుపొందింది. లండన్-మాస్కోల మధ్య నడిపే బ్రిటిష్ ఎయిర్‌వేస్ డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787-9 తరహా విమాన సర్వీసు ప్రచారం కోసం ఆమె ఇలా పోజిచ్చింది. విమానం ఎక్కకుండానే ఈమె పోజును చూసి చాలామంది గాలిలో తేలిపోయినట్లు ఫీలయ్యారు.

భారతి

సాక్షిని నేను

దిక్కులన్నీ ఎడారులైన అబుదబిలో
ఉదయించే సూర్యుడు భూమిపై
విత్తులా మొలకెత్తినట్లు
అస్తమించే సూర్యుడు తల్లి సీతమ్మలా
భూగర్భంలోకి దిగినట్లు ఉంది!
రోడ్లు సరళ రేఖలై సమాంతరంగా
వృత్తాలు అర్ధవృత్తాలుగా నిర్మించబడి
బెల్జియం అద్దాల్ని మరపించటం చూశాను!
ట్రాఫిక్ సిగ్నల్ గీచిన లక్ష్మణరేఖ ముందు
వాహన దండు వినమ్రంగా నిల్చి
ఎదురొచ్చిన వాహన సమూహానికి
సాదర వీడ్కోలు పలకటం
రోడ్డెంబడి భద్రతా సిబ్బందిలా
అడుగడుగునా కెమెరాలు నిల్చి
రక్షణ వ్యవస్థను పరిరక్షించటం చూశాను!
ఆకాశం అంటిన సుందర హర్మ్యాల
ఆఖరి అంతస్తులపై

-అడిగోపుల వెంకటరత్నమ్

అమ్మతనం

పండుగలో తగులూ మిగులూ ఉన్నట్టు
వాన వెలిసిన తర్వాత
వర్షిస్తున్న చెట్టు...
తల్లి పేరంటాని కెళ్లినపుడు
వాయినంగా తనకిచ్చిన పండుని
ఇంటి దగ్గరి బిడ్డకి జాగ్రత్తగా తెచ్చినట్టు...
అమ్మతనంలో
తల్లికి చెట్టుకి తేడా లేదు కదా..!

-ఎస్.హనుమంతరావు 8897815656

వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

పురిటి నొప్పులు పడకుండా
నవమాసాలు మోయాలన్న బాధ లేకుండా,
ప్రసవ వేదన అనుభవించకుండా,
అద్దె గర్భాలు దొరుకుతున్నప్పుడు
‘మాతృత్వం’ మమకారం లేనిదైనప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

ఆప్యాయంగా మాట్లాడుకుందామన్నా
మనిషికి మనిషి దొరకని ఈ రోజుల్లో
మాటల్ని అమ్ముకునే వాళ్లు అమ్ముకుంటుంటే
కొనేవాళ్లు ధర నిర్ణయించి కొంటుంటే
‘మాట’ అనురాగాప్యాయతలు కరువై
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

-మొగిలి స్వామిరాజ్ 9963642205

ఎడిటర్‌తో ముఖాముఖి

ప్రకాశరావు, మర్రివాడ, కృష్ణాజిల్లా
మా దళితవాడ (మాలపల్లె)లో ఐదు చర్చిలున్నవి. ఐదుగురు పాస్టర్లున్నారు. పాస్టర్లతోసహా దళిత క్రైస్తవులందరిని రెవిన్యూ వారు ఓటరు లిస్టులో షె.కు.లుగా రాస్తున్నారు. వారిలో ఎవరికైనా ఎస్.సి. సర్ట్ఫికెట్ కావాలంటే పంచనామా ద్వారా మంజూరు చేస్తున్నారు. దళితులెవరో, దళిత క్రైస్తవులెవరో తెలియుట లేదు. ఒకవైపు దళిత క్రైస్తవులుగా జీవిస్తూ దళితులుగా ధృవీకరణ పత్రాలు తీసుకొని నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ప్రార్థనా మందిరాలలో హిందువులను ద్వేషిస్తూ ప్రసంగిస్తారు. రాజకీయ అవసరాల దృష్ట్యా దళితులమంటారు. ఎంతకాలమిలా ద్విపాత్రాభినయం చేస్తారు?

Pages