S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్ల గులాబి

‘విశ్వా ఒక గులాబి మొక్క కొనివ్వవా’ అని అడిగింది స్నేహితురాలు వాసంతి. సరేనంటూ ‘ఏ గులాబి మొక్క? తెల్లదా, ఎర్రదా?’ అని అడిగాడు. ‘నాకు తెల్ల గులాబి చెట్టు కావాలంది. ఆ తరువాత కొన్ని రోజులకు విశ్వ ఒక ఎర్ర గులాబి మొక్కను తీసుకువచ్చి ప్రేమగా పెంచాడు. అభిమానాన్ని వర్షంగా కురిపించి అందమైన గులాబి పువ్వును పూయించాడు. ఎర్ర గులాబీ తీసుకువచ్చి వాసంతికి ఇవ్వబోయాడు. వాసంతి వద్దని అంది. ‘నేనడిగింది ఎర్రది కాదు, నాకు తెల్ల గులాబి కావాలి’ జీవితాన్ని ప్రశాంతంగా గడుపాలని, శాంతంగా ఉండాలని, తెల్ల గులాబీ కావాలని విశ్వాన్ని కోరింది. సరేనని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

- హనుమాండ్ల రమాదేవి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా సెల్.నం.9959835745

బాధ పడితే గాని... ( కథానిక)

శే్వత బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... అందం, చదువు సాంప్రదాయం మెండుగా వుండే శే్వతను పెళ్లి చేసుకోడానికి, పెళ్లి కొడుకులు క్యూకట్టారు. మంచి మంచి సంబంధాలు వచ్చినా మేనత్త కొడుకు మధుసూదనరావునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది శే్వత.
మధుసూదనరావు పక్కా పల్లెటూరు వ్యక్తి. పదెకరాల పొలం, ఒక పెంకుటిల్లు అతని ఆస్తి. తలిదండ్రులకు ఒకడే కొడుకు. బికాం చేశాడు.

- మీగడ వీరభద్రస్వామి, చోడవరం, విశాఖజిల్లా-531036. సెల్ : 9441571505

చైతన్య కవిత్వం.. మళ్లీ చిగురించనీ ( పుస్తక సమీక్ష)

కవితా శీర్షికలోనే అభ్యుదయ కాంక్ష, ఆశావాదం, చైతన్యాన్ని, నవతను ఆహ్వానించడం వంటి అర్థాలున్నాయి. నిరాశ, నిస్పృహ, నిర్వీర్యతలను నిరసించడం అంతర్లీనంగా కనిపిస్తుంది. చేయి తిరిగిన రచయిత్రి బి. కళాగోపాల్ రచన ఇది. 74 కవితలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. చదివిస్తాయి, అలరిస్తాయి. వైవిధ్యభరిత కవితల్లో భావాలు వెల్లివిరుస్తాయి. కొన్ని ఆకాంక్షల్ని కొన్ని ఆక్రోశాల్ని కొన్ని అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని అంతమొందించే ఆక్రందనల్ని, కొన్ని నినాదాల్ని నిరసనల్ని చూపిస్తాయి. కొన్ని మంజుల మనోహర ముగ్ధ్భావాల దొంతరలు మనసును దొలుస్తాయి. కొన్ని యువతకి సందేశాలు, మనసుని దోస్తాయి. కొన్ని యువతకి సందేశాలు, స్ఫూర్తినిస్తాయి.

అనసూయ (మినీకథ)

ఆఫీసుకు వెళ్లి వస్తానని మోహన్ భార్య సుజాతకి చెప్పి తన మోటారు బైక్‌పై బయలుదేరాడు.
‘‘ఏమండీ సాయంకాలం ఆఫీసు అయ్యాక మా ఫ్రెండ్ అనసూయ వాళ్లింటికి రండి. నేను వాళ్లింట్లో ఫంక్షన్‌కి వెళతాను’’ అంది సుజాత.
‘‘అలాగేలే’’ అని చెప్పి మోహన్ ఆఫీసుకి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం పర్మిషన్ అడిగి స్నేహితురాలింటికి వెళ్లాలని అనుకుంది. అనసూయ సుజాతకి చిన్నప్పటి నుండి స్నేహితురాలు. పెద్దయ్యాక కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది. ఒకే పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు.
సుజాతకి ఇద్దరూ మగపిల్లలే. ఎనిమిది, ఆరు చదువుతున్నారు. అనసూయకి ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్లు కూడా ఎనిమిది, ఆరు చదువుతున్నారు.

- జి. కృష్ణకుమారి, బాబామెట్ట, విజయనగరం. సెల్ : 9441567395.

బ్లాటర్ ఖేల్ ఖతం

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమస్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తన ‘ఆఖరి యుద్ధం’లో ఓడాడు. తనపై విధించిన ఆరు సంవత్సరాల నిషేధాన్ని సవాలు చేస్తూ అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) కొట్టేసింది. ఫిఫాకు కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నిక చెల్లదని, అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బ్లాటర్ డిమాండ్ చేశాడు. ఫిఫా అధ్యక్ష ఎన్నిక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. ఆ పదవికి ఎన్నికైన కొద్ది రోజులకే బ్లాటర్ రాజీనామా చేయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Pages