S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/21/2018 - 02:53

ట్రెంట్‌బ్రిడ్జి, ఆగస్టు 20: ఇంగ్లీష్ బంతులను టీమిండియా ఉతికి ఆరేసింది. పేసర్లు, స్పిన్నర్లన్న తారతమ్యం లేకుండా ప్రతి బంతినీ జాగ్రత్తగా ఆడుతూ 520 పరుగుల అత్యధిక ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ కోహ్లీ సెంచరీ, పూజారా బాధ్యతాయుత పరుగులు భారత్‌ను గెలుపు అంచుల్లోకి తీసుకెళ్ళాయి. అద్భుతమేదైనా జరిగితే తప్ప థర్డ్ టెస్ట్ భారత్ నుంచి చేజారడం అసాధ్యం.

08/21/2018 - 02:50

ఐదు పసిడి పతకాలకు గురిపెట్టిన చైనా స్విమ్మర్ సున్ యంగ్ ఆదివారం సంచలనం రేకెత్తించాడు. 800 మీటర్ల ఫ్రీస్టయల్ ఈవెంట్‌లో తొలి పతకం అందుకున్నాడు. రికార్డులను బ్రేక్ చేస్తూ లక్ష్యానికి చేరువైన సున్ వేగం ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు.

08/21/2018 - 02:48

పాలెంబాగ్, ఆగస్టు 20: షూటింగ్ వీరులు దీపక్ కుమార్, లక్ష్యే శరణ్‌లు 10మీటర్ల ఎయిర్ రైఫిల్, 10మీటర్ల పురుషుల ట్రాప్ ఈవెంట్లలో రజతాలు సాధించి భారత పతకాల సంఖ్యను పెంచారు. ప్రతిష్మాత్మక ఈవెంట్‌లో పతకం కోసం 33ఏళ్ల దీపక్ కుమార్ ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వచ్చినా, లక్ష్యే మాత్రం గన్ పట్టిన నాలుగేళ్లలోపే గౌరవప్రద పతకం సాధించి భారత ప్రతిష్టను పెంచాడు.

08/21/2018 - 00:47

జకార్తా, ఆగస్టు 20: భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చరిత్ర సృష్టించింది. 18వ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. మెడల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఫొగట్, ఆదివారం 50 కేజీ విభాగం ఫ్రీస్టైల్ ఫైనల్స్‌లో జపాన్ ప్రత్యర్థి యుకి ఇరీని 6-2తో మట్టికరిపించింది.

08/20/2018 - 01:45

లండన్, ఆగస్టు 19: గెలుపే లక్ష్యంగా థర్డ్ టెస్ట్‌లో భారత్ శ్రమకోడుస్తోంది. రెండోరోజు టీ విరామం సమయానికి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసిన కోహ్లీసేన, సెకండ్ ఇన్నింగ్స్‌నూ నిలకడగానే ఆడుతోంది. ఆదివారం ఆట ముగించే సమయానికి 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు సాధించి, 292 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

08/20/2018 - 01:15

జకార్తా, ఆగస్టు 19: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో స్టార్ అథ్లెట్ భజరంగ్ పునియా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించాడు. స్వర్ణంపై నమ్మకం పెట్టుకున్న మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రం నిరాశపర్చాడు. 65 కేజీ విభాగంలో తొలి మ్యాచ్‌కు బై సాధించిన కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత భజరంగ్ పునియా ఆదివారం నాలుగు బౌట్లలో అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాడు.

08/19/2018 - 02:15

దేదీప్యమైన వెల్తురు మొగలో తలారుబోసుకున్న వర్ణ సమ్మిళిత సంప్రదాయ సమన్ నృత్యాన్ని ప్రపంచం రెప్పార్పకుండా చూసింది. ప్రపంచ శాంతికి పదం పాడుతూ, ప్రగతి సాధనకు పాదం కదుపుతూ 18వ ఆసియా క్రీడోత్సవ సంరభానికి ఇండోనేసియా వేదికైంది. అధ్యక్షుడు విడోడోకూ తప్పని ట్రాఫిక్ స్థంభనలను అతిశయోక్తిగా చూపుతూ.. కత్తులు దూసుకుంటున్న కొరియన్ల సమైక్యతను చాటుతూ.. ఆసియా దేశాల పతాక రెపరెపలను మీటుతూ..

08/19/2018 - 02:08

లండన్, ఆగస్టు 18: సారథి కోహ్లీ నిబ్బరం టీమిండియాకు నిలకడ నేర్పింది. ధర్డ్ టెస్ట్ జరుగుతున్న ట్రెంట్‌బ్రిడ్జి భారత్‌కు కలిసొచ్చింది. చావో రేవో తేల్చుకోక తప్పని స్థితిలో బరిలోకి దిగిన కోహ్లీసేన, ఆచి తూచి పరుగులు తీసింది. శనివారం మొదలైన ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌లో భారత్ ఆశాజనకమైన స్కోరుతోనే (307/6, 86 ఓవర్లు) తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది.

08/19/2018 - 01:55

జకార్తా, ఆగస్టు 18: మాజీ ప్రపంచ చాంపియన్, 9వ ర్యాంకర్ హోదాలో బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా గేమ్స్‌నుంచి నేరుగా టోక్యో 2020 ఓలింపిక్‌కు బెర్త్ రిజర్వు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 1982 న్యూఢిల్లీ ఆసియా గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన భారత జట్టు, దక్షిణ కొరియా 1998లో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.

08/19/2018 - 01:54

పాలెంబాగ్, ఆగస్టు 18: ఆసియా గేమ్స్‌లో టెన్నిస్ ‘షో’ ఆరంభానికి 24 గంటల ముందు భారత ‘జట్లు’ ఖరారయ్యాయి. ఆసియా గేమ్స్‌నుంచి సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ చివరి క్షణంలో తప్పుకోవడంతో ఎవరెవరు జోడీ కట్టాలన్న దానిపై సందేహాలు అలముకున్నాయి. ఆదివారం నుంచి టీం మ్యాచ్‌లు ఆరంభమవుతున్న నేపథ్యంలో శనివారం ‘డబుల్స్’ జట్లను ఖరారు చేశారు.

Pages