S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/04/2018 - 01:27

నాన్జింగ్ (చైనా): స్టార్ షట్లర్ పీవీ సింధు భారత్ ఖాతాలో పతకాన్ని ఖాయం చేసింది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కలగా మిగిలిన స్వర్ణంవైపు దూసుకెళ్తోంది. అకుంఠిత పోరాటంతో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ 6వ సీడ్‌ను మట్టికరిపించిన సింధు, రేపటి సెమీఫైనల్స్ మ్యాచ్‌పై ఆసక్తిని రేపింది.

08/04/2018 - 01:06

బర్మింగ్‌హామ్, ఆగస్టు 3: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న తొలి టెస్ట్ మలి ఇన్నింగ్స్‌లోనూ భారత్ కష్టాల్లోనే పరుగులు తీస్తోంది. అజేయ శతకంతో తొలి ఇన్నింగ్స్‌ను ఆదుకున్న సారథి కోహ్లీ, మలి ఇన్నింగ్స్‌లోనూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇంగ్లాండ్. అయితే భారత బౌలర్లు విరుచుకుపడటంతో 180 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది.

08/04/2018 - 01:04

కోల్‌కతా, ఆగస్టు 3: ఆసియా గేమ్స్‌లో మూడు స్వర్ణాలు సాధించడమే భారత ఆర్చరీ ముందున్న ప్రధాన లక్ష్యమని చీఫ్ కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ వ్యాఖ్యానించాడు. 2014 ఆసియా గేమ్స్ నాలుగు విభాగాల్లో పతకాలు సాధించినా, ఈసారి పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగాలస్థానే మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్‌లో భారత్ పాల్గొంటోంది. ‘2014లో అభిషేక్ వర్మ (రజితం), త్రిషాదేవ్ (కాంస్యం)లు వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించారు.

08/04/2018 - 01:15

బర్మింగ్‌హామ్, ఆగస్టు 3: టీమిండియాను గట్టెక్కించడానికి సారథి సాధించిన పరాక్రమ శతకాన్ని ప్రపంచం మొత్తం వేనోళ్ల పొగుడుతుంటే.. విరాట్ మాత్రం ‘వీ-టు’ అంటున్నాడు. ‘అడిలైడ్ ఆనందం ఎప్పటికీ మరువనని, అక్కడ కలిగిన సంతృప్తే కెరీర్‌లో అత్యుత్తమ’మని రేటింగిచ్చాడు.

08/03/2018 - 14:02

నాంజింగ్: ప్రపంచ చాంపియన్ షిప్‌లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. 31 నిమిషాల పాటు జరిగిన పోరులో మారిన్ 21-6,21-11తో గెలిచి సెమిస్‌లో అడుగుపెట్టింది. ఏ దశలోనూ మారిన్‌కు సైనా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆమె ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంది.

08/03/2018 - 00:48

నాన్‌జింగ్ (చైనా): భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరుకొని, సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఎనిమిది పర్యాయాలు క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. తెలుగు తేజం పీవీ సింధు కూడా సైనాతోపాటు క్వార్టర్స్ చేరింది.

08/03/2018 - 00:30

బర్మింగ్‌హామ్, ఆగస్టు 2: ఇంగ్లాండ్-్భరత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిధ్య జట్టుకు 13 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృధా అయ్యింది. మ్యాచ్ తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆతిధ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. జో రూట్ 80, బెయిర్ స్టో 70, జెన్నింగ్స్ 42 పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు సాధించలేకపోయారు.

08/02/2018 - 23:33

బర్మింహామ్, ఆగస్టు 2: ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడడం తనకు లాభించిందని ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్ తీరుతెన్నులపై ఒక అవగాహనకు రాగలిగానని ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పాడు.

08/02/2018 - 23:31

న్యూఢిల్లీ, ఆగస్టు 2: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధమవుతున్న భారత అథ్లెట్ నవీన్ దాగర్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. గౌహతిలో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో ఈ రన్నర్ నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు.

08/02/2018 - 04:37

నాన్జింగ్ (చైనా): ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ టోర్నీలో బుధవారం పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లు అనూహ్య విజయంతో ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. వరల్డ్ నెంబర్ 11 హెచ్‌ఎస్ ప్రణయ్ మాత్రం బ్రెజిలియన్ షట్లర్ వైగోర్ కోయెల్హో చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Pages