S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/29/2018 - 02:18

న్యూఢిల్లీ, జూలై 28: చెక్ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావాలో జరగనున్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంటినెంటల్ కప్ పోటీలకు భారత సంచలనాలు నీరజ్ చోప్రా, హిమదాస్ సహా మరో ఐదుగురు ఎంపికయ్యారు. ఓస్ట్రావాలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈవెంట్‌లో ఆసియా- ఫసిఫిక్ టీం తరఫున ఏడుగురు అథ్లెట్లను ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎంపిక చేసింది.

07/29/2018 - 02:16

లండన్, జూలై 28: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుఫ్తిల్ మెరుపులు మెరిపించాడు. 38 బంతుల్లో 102 పరుగులు సాధించి టీ-20ల్లో వేగవంతమైన సెంచరీలు సాధించిన స్ట్రయికర్ల జాబితాలోకి చేరిపోయాడు. వర్సెస్టర్‌షైర్, నార్తంప్టన్‌షైర్ జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 కౌంటీ మ్యాచ్‌లో గుఫ్తిల్ ఈ ఘనత సాధించాడు.

07/28/2018 - 00:14

జురిచ్: జావెలిన్ త్రో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సపాదించాడు. జురిచ్‌లో ఆగస్టు 30న జరగనున్న ఫైనల్స్‌కు నీరజ్‌తోపాటు ప్రపంచ చాంపియన్ జోహెన్నస్ వెట్టర్, ఒలింపిక్ చాంపియన్లు థామస్ రోహ్లర్, ఆండ్రియాస్ హఫ్‌మన్, ఎస్టోనియన్, రికార్డు హోల్డర్ మాగ్నస్ కిర్ట్‌లు అర్హత సాధించారు.

07/28/2018 - 00:12

హంబన్‌టోట, జూలై 27: భారత్ అండర్ 19 కుర్రాళ్లు శ్రీలంక యూత్ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. మహీంద్రా రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం కొనసాగిన రెండో టెస్ట్‌ను ఇన్నింగ్స్ సహా 147 పరుగుల ఆధిక్యంతో ముగించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి రోజు మ్యాచ్‌లో అద్భుత ఫాం ప్రదర్శించిన ఎడమ చేతివాటం స్పిన్నర్ సిద్దార్థ్ దేశాయ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

07/28/2018 - 00:10

క్లెమ్స్‌ఫోర్డ్, జూలై 27: కౌంటీ చాంపియన్ ఎసెక్స్‌ను మార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఎదుర్కొన్న తీరు చూస్తే కోహ్లీటీంపై సందేహాలు ముసురుతున్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం సారథి కోహ్లీకైనా సాధ్యమేనా? అన్న సందిగ్దం తలెత్తుతోంది. కౌంటీ జట్టుపై ప్రాక్టీస్ మ్యాచ్‌ను మమ అనిపించడం తప్ప టీమిండియా మెరిపించిన మెరుపులేవీ లేవు.

07/28/2018 - 00:10

న్యూఢిల్లీ, జూలై 27: జూనియర్ ఎన్‌బిఏ ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీకి భారత్ నుంచి 20మంది బాలబాలికలు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13, 14 ఏళ్ల పిల్లలతో ఎన్‌బిఏ గ్లోబల్ యూత్ బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించడం ఇదే ప్రథమం. జూనియర్ ఎన్‌బిఏ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పోటీ పడనున్న వివిధ దేశాలకు చెందిన 32 జట్లను ఇప్పటికే ఎన్‌బిఏ ప్రకటించింది కూడా.

07/28/2018 - 00:09

వ్లాదివోస్టాక్ (రష్యా), జూలై 27: రష్యా ఓపెన్ బీడబ్ల్యుఎఫ్ టూర్ సూపర్ 100 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్‌లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

07/27/2018 - 03:12

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ షెడ్యూల్‌పై మాజీ సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసియా కప్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వల్ల భారత క్రికెటర్లపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు.

07/26/2018 - 23:38

లండన్, జూలై 26: మహిళల హాకీ వరల్డ్ కప్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ప్రపంచ కప్‌లో తొలి విజయాన్ని అందుకోవాలన్న భారత జట్టు ఆశలు నెరవేరలేదు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ క్రీడాకారిణి అన్నా ఓ ఫ్లాంగన్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గట్టి పోటీనిచ్చి గెలుపుదిశగా సాగినా చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

07/26/2018 - 23:36

న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో క్రీడల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విజ్ఞప్తి చేశాడు.

Pages