S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/01/2018 - 03:57

మొనాకో, ఫిబ్రవరి 28: స్విట్జర్లాండ్ వెటరన్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ హేమాహేమీలైన యువ ఆటగాళ్లతో పోటీపడుతూ దూసుకెళుతున్నాడు. 36 ఏళ్ల వయసులోనూ టైటిళ్లను కైవసం చేసుకోవడమేగాక, ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కూడా ఆక్రమించి సత్తా నిరూపించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఎక్కువ వయసుగల ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఫెదరర్ ఇక్కడ జరిగిన మొనాకో ఓపెన్‌లో టైటిల్ సాధించాడు.

03/01/2018 - 03:56

ముంబయి, ఫిబ్రవరి 28: అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే డీఆర్‌ఎస్‌కు నిన్నమొన్నటి వరకూ ససేమిరా అన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తన మొండి వైఖరిని మార్చుకుంటున్నది. ఇటీవల స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో డీఆర్‌ఎస్‌ను అమలు చేయడానికి అంగీకరించిన బీసీసీఐ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

03/01/2018 - 03:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దక్షిణాఫ్రికాతో ఇటీవల భారత క్రికెట్ జట్టు ఆడిన టెస్టుమ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతోపాటు, మూడు ఫార్మాట్లలోనూ చక్కని ఆటతీరును కనబరిచి ‘టెస్ట్ మ్యాచ్ బౌలర్’ ఖ్యాతి గడించిన జస్‌ప్రీత్ బుమ్రాపై ఒత్తిడిని తగ్గిస్తామని జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు సిరీస్‌లలో బుబ్రా మొత్తం 162.1 ఓవర్లు బౌలింగ్ వేశాడు.

03/01/2018 - 03:52

మొనాకో, ఫిబ్రవరి 28: క్రికెట్‌లో వచ్చే ఏడాది వరకు కొనసాగుతానని, ఆ తర్వాతే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

03/01/2018 - 03:51

దర్బన్, ఫిబ్రవరి 28: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ల్లో స్లెడ్జింగ్‌కు దిగాలని సహచరులకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూచించాడు. గురువారం నుంచి ఇక్కడ మొదటి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యర్థులను హేళన చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే స్లెడ్జింగ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు మొనగాళ్లని అన్నాడు.

03/01/2018 - 03:50

అకాపల్కో (మెక్సికో), ఫిబ్రవరి 28: ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్‌ను మళ్లీ గాయాల బెడద వెంటాడుతున్నది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఈ 31 ఏళ్ల టెన్నిస్ స్టార్ నాదల్ ఇక్కడ మెక్సికో ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, వెన్ను నొప్పి కారణంగా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్టు నాదల్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో తన పాత గాయం తిరగబెట్టిందని అతను తెలిపాడు.

03/01/2018 - 03:49

పారిస్, ఫిబ్రవరి 28: పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ) క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌కు త్వరలోనే శస్త్ర చికిత్స జరగనుంది. లీగ్-1 పోటీల్లో భాగంగా మార్సెలీతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు పొరపాటున కిందపడ్డాడు. గాయపడిన అతనిని క్లబ్ అధికారులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలి మడమకు బలమైన గాయమైనట్టు వైద్య పరీక్షల్లో స్పష్టమైంది.

03/01/2018 - 03:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: భారత్‌కు చెందిన అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ 29 ఏళ్ల దేవేందర్ సింగ్ కాంగ్‌పై నాలుగేళ్లపాటు నిషేధం విధించారు. గత వారం నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్టు ఆరోపణలు రావడంతో తగిన పరీక్షల అనంతరం అది రుజువు కావడంతో అతనిపై ఈ చర్య తీసుకున్నట్టు అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అధికారులు పేర్కొన్నారు.

03/01/2018 - 03:47

కేప్‌టౌన్, ఫిబ్రవరి 28: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో స్థానికులు ఎదుర్కొంటున్న దాహార్తి నివారణకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫఫ్ డుప్లెసిస్ తమ సహచర జట్టు సభ్యులంతా కలసి 8,500 అమెరిన్ డాలర్ల విరాళం అందజేశారు. కేప్‌టౌన్‌లో ప్రజలు నీటికోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వారు ఇచ్చిన నిధులతో వాటర్ బాటిళ్లు అందజేయడంతోపాటు బోర్‌వెల్స్ వేస్తారు.

03/01/2018 - 03:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: షటిల్ బాడ్మింటన్‌లో 11 పాయింట్ల విధానం సరైంది కాదని భారత షటిల్ బాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ పేర్కొన్నాడు. బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌లు (బీడబ్ల్యుఎఫ్) తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వల్ల ఎలాంటి క్రీడారంగంలో ఆశించిన అంచనాలను అందుకోలేదని ఆయన వ్యాఖ్యానించాడు.

Pages