S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/05/2017 - 01:12

బిష్కెక్, జూలై 4: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఇండియా-ఏ జట్టు టైటిల్‌కు చేరువైంది. మంగళవారం ఇక్కడ పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్ తమతమ ప్రత్యర్థులపై సత్తా చాటుకుని ఇండియా-ఏ జట్టును ఫైనల్‌కు చేర్చారు. క్వార్టర్ ఫైనల్‌లో ఇరాన్-ఏ జట్టును 1-3 తేడాతో ఓడించిన అద్వానీ, రావత్ ఆ తర్వాత పూర్తి ఏకపక్షంగా జరిగిన సెమీ ఫైనల్‌లో థాయిలాండ్-ఏ జట్టును 0-3 తేడాతో మట్టికరిపించారు.

07/05/2017 - 01:12

లండన్, జూలై 4: లక్సెంబర్గ్‌కు చెందిన మాండీ మినెల్లా నాలుగున్నర నెలల గర్భంతో వింబుల్డన్‌లో ఆడడం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకొంది. తల్లులు కాబోతున్న, ఇప్పటికే తల్లులు అయిన టెన్నిస్ తారలు సెరీనా విలియమ్స్, విక్టోరియా అజరెన్కాల సరసన 31 ఏళ్ల మినెల్లా కూడా త్వరలోనే చేరబోతోంది.

07/05/2017 - 01:10

ఇస్లామాబాద్, జూలై 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇకమీదట అన్ని ఫార్మాట్లలోనూ సర్‌ఫ్రాజ్ అహ్మద్ సారథిగా వ్యవహరించనున్నాడు. వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తున్న సర్‌ఫ్రాజ్ గత నెల ఇంగ్లాండ్‌లో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టును విజయ పథంలో నడిపించడంతో పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతనికి టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.

07/05/2017 - 01:09

న్యూఢిల్లీ, జూలై 4: భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుని ఉండవచ్చు. అయితే ఈ రెండు దేశాల మధ్య స్నేహవారధులను నిర్మించే ఓ అత్యుత్తమ మార్గంగా ఉపయోగపడుతానని క్రికెట్ మరోసారి రుజువు చేసింది.ఈ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో సైతం ఈ విషయం రుజువైంది.

07/04/2017 - 00:59

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 3: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డలో ఆ జట్టు 11 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించి సంచలనం విజయాన్ని నమోదు చేసుకుంది.

07/04/2017 - 00:54

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 3: కరీబియన్లతో ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా సోమవారం ఆంటిగ్వాలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా అప్పటికి 45 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. 46వ ఓవర్‌లో విండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ వేసిన తొలి బంతికి ఒక పరుగు రాబట్టుకోవడం ద్వారా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

07/04/2017 - 00:52

న్యూఢిల్లీ, జూలై 3: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ సోమవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతను ఈ పదవి కోసం పోటీపడుతున్న వారిలో ముందు నిలిచాడు. రవిశాస్ర్తీతో పాటు వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఫిల్ సిమ్మన్స్ కూడా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించాడు.

07/04/2017 - 00:51

బ్యాంకాక్, జూలై 3: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. క్వార్టర్ ఫైనల్ బౌట్లలో బూర నవీన్, అంకిత్ తమతమ ప్రత్యర్థులను మట్టికరిపించి భారత్‌కు ఈ పతకాలను ఖాయం చేశారు.

07/04/2017 - 00:51

లండన్, జూలై 3: ఇటీవల కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారకురాలైనందుకు న్యాయస్థానంలో కేసును ఎదుర్కొంటున్న అమెరికా టెన్నిస్ తార వీనస్ విలిమయమ్స్ (37) ఆ వత్తిడి నుంచి బయటపడి ఆటపై మళ్లీ దృష్టి సారించగలిగింది. దీంతో ఆమెకు వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌లో శుభారంభం లభించింది.

07/03/2017 - 01:11

లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత సెరెనా విలియమ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తల్లికానున్నందున ఈసారి పోటీకి దిగడం లేదు. మరో స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా కాలి కండరాల నొప్పితో విశ్రాంతి తీసుకుంటున్నది. వీరిద్దరూ లేకపోవడంతో, ఈసారి మహిళల విభాగంలో పోరు ఆసక్తికరంగా సాగనుంది.

Pages