S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/04/2018 - 01:18

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మిషన్ భగీరథ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ‘మిషన్ భగీరథ పర్ధాకే పీచే క్యా హై..’ అనేది ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. తాగు నీరు పేరిట ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు.

02/04/2018 - 01:17

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణలో 2017-18 సంవత్సరం యాసంగి (రబీ) పంటకు సంబంధించి పల్లీ కొనుగోలు చేసేందుకు తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్‌ను (టిఎస్ ఆయిల్‌ఫెడ్) నోడల్ ఏజెన్సీగా నియమించారు. అలాగే పెసల కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర మార్కెట్ ఫెడరేషన్‌ను (మార్క్‌ఫెడ్) నోడల్ ఏజెన్సీగా నియమించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లేదా ప్రైస్ సపోర్ట్ స్కీం అమలు చేయాల్సిన బాధ్యత ఈ రెండు సంస్థలపై ఉంటుంది.

02/04/2018 - 01:17

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ చైర్మన్‌గా తెలంగాణ ఎక్సలెన్స్ (టెక్స్) అవార్డుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్ మెంబర్‌గా జిఎడి ముఖ్యకార్యదర్శి శాలినీ మిశ్రాను నియమించారు. సభ్యులుగా తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ చందా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.

02/04/2018 - 00:33

మేడారం, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారంలో భక్తుల సౌకర్యార్థం కోసం, అభివృద్ధి కోసం 200కోట్లు విడుదల చేసి మేడారాన్ని మహద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు స్వాగతిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీల లాగానే మేడారం జాతర నిధుల హామీ మిగలకుండా ఉండాలని తల్లులను వేడుకుంటున్న ఆయన తెలిపారు.

02/04/2018 - 00:29

నల్లగొండ, ఫిబ్రవరి 3: విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా కేంద్రం వేదికగా ఆదివారం నుండి సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిర్వహణకు పార్టీ రాష్టశ్రాఖ సర్వం సిద్ధం చేసింది. ఆదివారం నుండి నుండి నాలుగు రోజుల పాటు కొనసాగనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలు తెలంగాణ వివిధ జిల్లాలకు చెందిన నాలుగువేల మంది రెడ్‌షర్ట్స్(ఎర్రదండు) సభ్యుల కవాతుతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి.

02/04/2018 - 00:29

నల్లగొండ, ఫిబ్రవరి 3: ఇటీవల హత్యకు గురైన నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ సంతాపసభను ఆదివారం నల్లగొండలో భారీ ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసింది.

02/04/2018 - 00:28

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందని, దీంతో ప్రజల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.

02/04/2018 - 00:26

మేడారం, ఫిబ్రవరి 3:మేడారం సమక్క సారలమ్మ జాతరను గిరిజన సంస్కృతికి భంగం కలుగకుండా నిర్వహించామని, ఒక కోటి 20 లక్షలమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని, జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినందుననే జాతర విజయవంతం అయ్యిందని భూపాలపల్లి ఇంచార్జి కలెక్టర్ కర్ణన్ అన్నారు.

02/03/2018 - 04:25

హైదరాబాద్, ఫిబ్రవరి 2: యాదాద్రి ఆలయ పునర్మిణానికి డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి భద్రాచలం ఆలయ నిర్మాణానికి కూడా డిజైన్ చేసారు. వీటిని శుక్రవారం రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు అనందసాయి సమర్పించారు. శ్రీ చినజీయర్ స్వామి ఆశ్సీస్సులు, సూచనల మేరకు తయారు చేసిన నమూనాలు చక్కగా కుదిరాయని మంత్రి తుమ్మల అన్నారు.

02/03/2018 - 04:23

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ విద్యుత్ సంస్థలు బలవంతంగా 1259మంది ఆంధ్ర స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వ్యులను హైదరాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. వీరిని రిలీవ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం వెలువరించింది.

Pages