S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2018 - 23:55

హైదరాబాద్, జనవరి 31: దేశంలో రోజు రోజుకు జర్నలిస్టులపై పెరిగిపోతున్న దాడుల నేపథ్యంలో వీరి రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ డిమాండ్ చేసారు. భుననేశ్వర్‌లో బుధవారం ఒరిస్సా జర్నలిస్ట్స్ యూనియన్ మహాసభలను అమర్ ప్రారంభించారు.

01/31/2018 - 23:54

హైదరాబాద్, జనవరి 31: ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం వారిరువురూ మీడియాతో కొంతసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు.

01/31/2018 - 23:53

హైదరాబాద్, జనవరి 31: కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల మంజూరు వేగవంతమైంది. ఫార్మాసిటీకి సంబంధించి అదనపు సమాచారాన్ని వెంటనే పంపించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది.

01/31/2018 - 23:52

హైదరాబాద్, జనవరి 31: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ అమలుచేయాలని ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నా, అది ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్నాటకలో కన్నడ తప్పనిసరి చేయడంతో అక్కడ ఉన్న యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

01/31/2018 - 23:51

కందుల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలంటూ కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీష్‌రావు మరొక లేఖ రాశారు. గత నెలలో ఆయన కేంద్ర మార్కెటింగ్ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణలో 2.84 లక్షల టన్నుల కందులు ఉత్పత్తి అవుతున్నాయని, ఇందులో 1.50 లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రప్రభుత్వం 53,600 టన్నుల కందుల సేకరణకు మొదట అంగీకరించిందని, ఇది సరిపోదన్నారు.

01/31/2018 - 23:51

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతుల ఆదాయం పెరుగుతోందని, 2022 నాటికి ఈ ఆదాయం రెట్టింపు అవుతుందని మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో మార్కెటింగ్ పరిస్థితిపై అధ్యయనం చేసి వచ్చిన అధికారుల బృందంతో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. ఆ యా రాష్ట్రాల్లో పరిస్థితిపై వారు మంత్రికి వివరించారు.

01/31/2018 - 23:50

హైదరాబాద్, జనవరి 31: నేషనరల్ టౌన్ కంట్రీ ప్లానర్స్ కాంగ్రెస్ (ఐటిపిఐ) మహాసభలు ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు మూడురోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ డిఎస్ మేష్రామ్ తెలిపారు. నగర పర్యావరణ ప్రణాళికలు, పరిణామాలు, సవాళ్లు, నగరీ కరణ వల్ల ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లు, పర్యావరణం, అభివృద్ధి ప్రణాళికలు, అర్బన్ ఫ్లడింగ్ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు.

01/31/2018 - 23:02

మేడారం, జనవరి 31: ఆశేష భక్తజనావళి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టాలు బుధవారం రాత్రి చోటుచేసుకున్నాయి. సారక్క తల్లే దండాలో అంటూ లక్షలాది మంది భక్తులు చేసిన సారలమ్మ నామస్మరణతో బుధవారం కనె్నపల్లి నుండి మేడారం వరకు మేడారం జాతర ప్రాంగణం మారుమోగిపోయింది. కనె్నపల్లిలో కొలువున్న సారలమ్మ బుధవారం మేడారం గద్దెకు చేరడంతో నాలుగు రోజులపాటు జరగనున్న మహా ఘట్టానికి తెరలేచింది.

01/31/2018 - 22:58

మేడారం, జనవరి 31: పదివేల మంది పోలీసులు..్భరీ సంఖ్యలో అధికారులు..వీరికి తోడు ఆధునిక టెక్నాలజీ వినియోగం.. అయినా మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు యంత్రాంగం మొదటి రోజే విఫలమయింది. సమస్య తీవ్రతను గమనించి జాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సాక్షాత్తూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ములుగు ప్రాంతంలో, మేడారంలో పోలీసు బాస్ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది.

01/31/2018 - 22:58

హైదరాబాద్, జనవరి 31: ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతరకు నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా 2.50 లక్షల మంది యాత్రీకులను చేరవేసినట్లు టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5,800 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని, సుమారు రూ.12000 మంది ప్రత్యేక అధికారులు పని చేస్తున్నారని తెలిపారు.

Pages