S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/11/2017 - 05:10

హైదరాబాద్, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం తీసుకుంటున్న వివిధ చర్యలను కేంద్రం అభినందించింది. రాష్ట్రంలో రహదారులు, జాతీయ రహదారులు చెట్లతో కళకళలాడాలని, దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని నేషనల్ హైవేస్ అథారిటీ (గ్రీన్ మిషన్ )సలహాదారు ఏకె భట్టాచార్య తెలిపారు.

06/11/2017 - 05:05

కెయక్యాంపస్ (వరంగల్) జూన్ 10: కాకతీయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో గత నెల 27న నిర్వహించిన ఎల్‌ఎల్‌బి మూడు, ఐదు సంవత్సరాల ప్రవేశ పరీక్ష ఫలితాలను లాసెట్ చైర్మన్ ఆర్ సాయన్న న్యాయ కళాశాల ప్రాంగణంలో శనివారం ఉదయం విడుదల చేశారు. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి ప్రవేశ పరీక్షలో జోగినిపల్లి సహజ 106 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. రెండవ ర్యాంకర్‌గా ఎన్. ఉదయభాను, మూడవ ర్యాంకర్‌గా భరత్‌రెడ్డి నిలిచారు.

06/11/2017 - 02:09

హైదరాబాద్, జూన్ 10: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడేళ్ళ పాలనపై దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ సమ్మేళన్’లో భాగంగా ఆదివారం పెద్దపల్లిలోని నందిని ఫంక్షన్ హాలులో జరిగే సభలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు.

06/11/2017 - 02:08

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలో 2016 మే నెలతో పోలిస్తే, 2017 మే నెలలో భూగర్భ జలమట్టం 3.44 మీటర్లకు పెరిగింది. రాష్టంలో సాధారణ వర్షపాతం 906 మిల్లీమీటర్లు ఉండగా, 2016-17 సంవత్సరంలో 1039 మిల్లీమీటర్లు నమోదైంది. నాలుగు పాత జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

06/11/2017 - 02:08

హైదరాబాద్, జూన్ 10: మియాపూర్ భూ కుంభకోణంలో రెవెన్యూ మంత్రిని బర్తరఫ్ చేయాలని టిటిడిపి జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మూడేళ్ల తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక ఈ భూ కుంభకోణమని ఎద్దేవా చేశారు. ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదని అన్నారు.

06/11/2017 - 02:07

హైదరాబాద్, జూన్ 10: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త జిఎస్‌టి విధానాన్ని సాఫీగా అమలు చేసేందుకు గాను 8 స్టాండింగ్ కమిటీలు, 18 సెక్టారల్ వర్కింగ్ గ్రూప్‌లను జిఎస్‌టి కౌన్సిల్ నియమించిందని హైదరాబాద్ సెంట్రల్ క్సైజ్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈ గ్రూప్‌లకు కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

06/11/2017 - 02:06

హైదరాబాద్, జూన్ 10: జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలో కొన్ని పార్టీలు అడ్డుపడడంతో కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి పంపించిందని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఇది బిసి వ్యతిరేక చర్య అని ఆయన విమర్శించారు.

06/11/2017 - 02:06

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 100 పురాతన విగ్రహాలు మాయమయ్యాయి. వీటిలో కొన్ని దొంగిలించబడినట్లు రికార్డు అయితే, మరికొన్ని మాయమైనట్లు సమాచారం. దీంతో కనిపించకుండా పోయిన ఈ వంద విగ్రహాలు ఎక్కడ ఉన్నదీ పోలీసులూ కనిపెట్టలేకపోయారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఒక పురాతన విగ్రహం చోరీకి గురవడం, దానిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం జరుగుతున్నట్లు పోలీసు వర్గాల అంచనా.

06/11/2017 - 02:04

హైదరాబాద్, జూన్ 10: గతంలో సాగుచేసిన పోడు భూములన్నింటిని తిరిగి ఈ ఏడాది సాగు చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వద్దామని వామపక్ష పార్టీలు తెలిపాయి. పోడు భూముల సమస్యలపై ఐక్య పోరాటం చేద్దామని పిలుపునిచ్చాయి. శనివారం నాడిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల రాష్ట్ర సమావేశం జరిగింది.

06/10/2017 - 03:19

నల్లగొండ, జూన్ 9: సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ అలుపెరుగని ప్రజాసేవకుడిగా తన రాజకీయ ప్రజాజీవన ప్రస్థానాన్ని సాగించి గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా గుర్తింపు పొందారు.

Pages