S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/09/2017 - 02:25

హైదరాబాద్, జూన్ 8: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో శనివారం శస్తచ్రికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ధోపెడిక్, న్యూరోఫిజీషియన్, హుద్రోగ నిపుణులు భరత సింహారెడ్డిని పరీక్షించారు.

06/09/2017 - 02:25

హైదరాబాద్, జూన్ 8: ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే ఎఎన్‌ఎంలకు జివో 14 ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలని, అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది.

06/09/2017 - 02:24

హైదరాబాద్, జూన్ 8: ఈ నెల 21న గచ్చిబౌలి స్టేడియం లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆయుష్ శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆ రోజు సామూహిక యోగా ప్రదర్శన ఉం టుందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, అధికారులు ఈ యోగ దినోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.

06/09/2017 - 02:24

హైదరాబాద్, జూన్ 8: నైపుణ్యమే విజయానికి ఆధారమని వెల్స్ ఫార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ చుండూరి అన్నారు. నాయకత్వ నైపుణ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించడం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు ముందుండాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం నాడిక్కడ ఎన్‌ఎంఐఎంఎస్ యూనివర్శిటీ రెండేళ్ల బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లోమా 7వ బ్యాచ్‌ను ప్రారంభించారు.

06/08/2017 - 02:18

హైదరాబాద్, జూన్ 7: గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపమైన మేడారం సమ్మక్క, సారక్క జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లను మంత్రి బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

06/08/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ రాష్ట్రంలోని ఐటిఐలలో ప్రవేశాలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నామని హోం, కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 64 ప్రభు త్వ ఐటిఐలలో 8,182సీట్లు, ప్రైవేట్ రంగంలోని 222 ఐటిఐలలో 33,980 సీట్లు ఉన్నాయని తెలిపారు.

06/08/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం స్కాంల ప్రభుత్వంగా మారిందని, ఇంతవరకు బహిర్గతమై అన్ని కుంభకోణాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మియాపూర్ భూస్కాం రోజుకోమలుపుతిరుగుతోందని, కాని ప్రభుత్వం మాత్రం పెదవి విప్పడం లేదన్నారు.

06/07/2017 - 03:21

హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్‌లో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాలకు చెందిన 20 మంది వ్యాపారులు అల్లం, వెల్లుల్లి, తేనె, నెయ్యి, నూనె కల్తీ చేసి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు సౌత్‌జోన్ పోలీసులు, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించి మంగళవారం వారిని అరెస్టు చేశారు.

06/07/2017 - 03:20

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో 119 బిసి గురుకుల పాఠశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతాయని, వీటివల్ల 41,863 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. పూలే బిసి గురుకుల పాఠశాలలను 12న లాంఛనంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. పాఠశాలల ప్రారంభోత్సవంపై మంత్రి జోగు రామన్న 31 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/07/2017 - 03:19

హైదరాబాద్, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కేసులో బాలానగర్ సబ్-రిజిస్ట్రార్ యూసుఫ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించింది.

Pages