S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/19/2016 - 04:41

హైదరాబాద్, ఆగస్టు 18: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియా గందరగోళం సృష్టిస్తోందని ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో చాలా వరకు వాస్తవదూరంగా ఉన్నాయని, దీనివల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది.

,
08/19/2016 - 04:33

భువనగిరి, ఆగస్టు 18: నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామం 194 సర్వేనెంబర్ ‘ఆ’ భాగంలో రైతులను బెదిరించి 6 ఎకరాల వ్యవసాయ భూమిని 2 లక్షల రూపాయలు చెల్లించి నయాం అనుచరులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన గురువారం వెలుగుచూసింది. ఈ ఆరెకరా ల భూమి 48 లక్షల రూపాయల విలువ ఉంటుందని బాధితులు చిక్కుల సత్యనారాయణ, చంద్రయ్య తెలిపారు. వారి కథనం ప్రకారం...

08/19/2016 - 04:54

మహబూబ్‌నగర్/అలంపూర్, ఆగస్టు 18: కృష్ణా పుష్కరాల్లో భాగం గా గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని దక్షిణ కాశీగా పిలువబడే అలంపూర్ జోగులాంబదేవి పుణ్యక్షేత్రంలో శతచండియాగం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ నుండి 24 వరకు ఐదవశక్తిపీఠం జోగులాంబ సన్నిధిలో యాగం కొనసాగనుంది. వేదమంత్రోచ్చరణల మధ్య, శాస్రోక్తంగా ప్రారంభమైన శతచండియాగానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

08/19/2016 - 04:55

జడ్చర్ల, ఆగస్టు 18: పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తూ ఆకస్మాత్తుగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెంది తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలుసుకున్న జడ్చర్ల వాసులు ఒక్కసారిగా హతాశులయ్యారు. సోమశిల పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానాలు చేసి పాప పరిహారాన్ని పొందాలనుకున్న వారిపై మృత్యువు కనె్నర్ర జేసి ఇద్దరిని కబలించింది. సమాచారం తెలుసుకున్న మృతుల బందువులు, పట్టణప్రజలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

08/19/2016 - 04:25

కరీంనగర్ టౌన్, ఆగస్టు 18: ప్రభుత్వోద్యోగుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాల తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 2న తలపెట్టనున్న దేశవ్యాప్త సమ్మెతో జాతీయస్థాయిలో పాలనను స్తంభింపజేస్తామని ప్రభుత్వోద్యోగుల సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు ముత్తు సుందరం స్పష్టం చేశారు. సమ్మెను విజయవంతం చేసే క్రమంలో గురువారం కరీనగరంలోని టిఎన్జీవోల భవన్‌లో జిల్లాస్థాయి సమ్మె సన్నాహక సదస్సు ఏర్పాటుచేశారు.

08/19/2016 - 04:21

హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్రంలో ఉద్యాన సాగుకు అనుకూలమైన వాతావరణంతో పాటు రైతులకు అధిక లాభం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ అనుంబ శాఖల కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అసోసియేషన్ ఆఫ్ ఇవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల మూడవ అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ మొక్కల ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు.

08/19/2016 - 04:20

నాగర్‌కర్నూల్, ఆగస్టు 18: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం సప్తనదుల సంగమంలో పుష్కరస్నానమాచరించి, పితృదేవులకు పిండప్రదానం చేశారు.

08/19/2016 - 04:17

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 18: ఈనెల 8న పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నరుూం అత్త, అతని బావమరది, బావమరది భార్యను స్టేట్ ఇనె్వస్టిగేటింగ్ టీం (సిట్) అధికారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఒన్‌టౌ న్ పోలీస్ స్టేషన్‌లో రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు.

08/18/2016 - 03:59

నాగర్‌కర్నూల్, ఆగస్టు 17: ఏడునదుల సంగమమైన సోమశిలలోని ఘాట్లన్నీ, శ్రీలలిత సోమేశ్వరాలయం బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమశిల పరవశమైంది.

08/18/2016 - 03:57

మహబూబ్‌నగర్, ఆగస్టు 17: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదవశక్తి పీఠానికి అంచనాలకు మించి భక్తుల తాకిడి ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఆరవ రోజు సైతం భక్తుల రద్ది మరింత పెరిగింది.

Pages