S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/24/2016 - 17:17

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తెలంగాణ సర్కారు ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలపై ఇక ఎలాంటి ఆంక్షలు ఉండవు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి, సచివాలయ స్థాయి ఉద్యోగులకు దీంతో ఊరట లభించింది. అయితే, ఆర్థికశాఖకు మాత్రం తాజా ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

05/24/2016 - 17:16

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలకు విద్యాశాఖ అధికారులను మాత్రమే పంపాలని, పోలీసు అధికారులను పంపవద్దని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని వారు మంగళవారం కలిసి తమ సమస్యలను విన్నవించారు. కాలేజీల్లో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

05/24/2016 - 17:15

హైదరాబాద్: నిరంకుశ నిజాం ప్రభువును ఎదిరించిన ఘనత తెలంగాణ ప్రాంతానికి ఉందని, సిఎం కెసిఆర్ ఓ లెక్కా.. అని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ కుటుంబాన్ని జనం తరిమికొట్టే రోజులొస్తాయన్నారు. సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జనం అదే సెంటిమెంటుతో తెరాసను గెలిపించి ఇపుడు బాధ పడుతున్నారన్నారు.

05/24/2016 - 17:13

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన తెలంగాణ ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 26న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన మంగళవారం నాడు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

05/24/2016 - 17:12

హైదరాబాద్: అల్లరి చేస్తున్నారని తల్లి తిట్టడంతో ముగ్గురు పిల్లలు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయిన ఘటన మీర్‌పేట వద్ద వెంకటగిరి కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. అల్లరి ఎక్కువైందని పిల్లలను సోమవారం సాయంత్రం తల్లి మందలించింది. దీంతో అలిగిన పిల్లలు శ్రీశైలం (10), రేణుక (8), శివ (7) ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పోయారు.

05/24/2016 - 17:11

హైదరాబాద్: కుటుంబ సమస్యల నేపథ్యంలో న్యాయం కోసం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లినా తనను ఎవరూ పట్టించుకోనందున మనస్తాపానికి లోనైన రేష్మ అనే గృహిణి ఆత్మహత్యకు యత్నించింది. నగరంలోని సిసిఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) ఎదుట మంగళవారం ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు.

05/24/2016 - 17:10

హైదరాబాద్: వరంగల్‌కు వెళుతున్న విరసం నేతలు వరవరరావు, వనమాల, హరగోపాల్ తదితరులను పోలీసులు మంగళవారం ఘట్‌కేసర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో జరుపతలపెట్టిన తెలంగాణ డమొక్రటిక్ ఫ్రంట్ సదస్సుకు విరసం నేతలు వెళ్లాలని భావించారు. అయితే, దారిలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. టిడిఎఫ్ సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సదస్సు జరిపేందుకు కోర్టు ద్వారా అనుమతి సంపాదిస్తామని విరసం నేతలు తెలిపారు.

05/24/2016 - 11:58

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి)లో మైనార్టీ కో-ఆప్షన్ సభ్యులుగా మహ్మద్ హుస్సేన్, డాక్టర్ విద్యాస్రవంతిలను ఎన్నుకున్నారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నికను నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. బిజెపి, టిడిపి కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు.

05/24/2016 - 11:58

హైదరాబాద్: గొంతుకోసి ఓ మహిళను దుండగులు కిరాతకంగా హత్య చేసిన సంఘటన మంగళవారం మాదాపూర్ సమీపంలోని నవభారత్‌నగర్‌లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, దుండగుల కోసం ఆరా తీస్తున్నారు.

05/24/2016 - 04:42

నిజామాబాద్, మే 23: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆయువు పట్టులా నిలుస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంపై స్పష్టత కరువైంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ సామర్థ్యం 1091 అడుగులు, 90 టిఎంసిలుగా పేర్కొంటున్నప్పటికీ, అది దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిపిన లెక్కింపుల ఆధారంగానే ఇప్పటికీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు.

Pages