S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/05/2018 - 06:08

హైదరాబాద్, జూలై 4: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గత ఏడాది ఇదే ప్రాజెక్టు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఈ ఏడాది అందించబోయే నీటితో కలిపి మొత్తంగా 3 లక్షల 60 ఎకరాలకు నీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నాగర్‌కర్నూల్ కలక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

07/05/2018 - 06:07

హైదరాబాద్, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం లక్ష్యం నెరవేరడం లేదని సిఎల్‌పి నేత కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు పథకంలో కౌలు రైతులను చేర్చకపోవడం బాధాకరమని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. కౌలుదారు అంటే లీజుదారు అని అర్థమని ఆయన చెప్పారు. కౌలుదారులు ఎంత మంది ఉన్నారో సరైన గణాంకాలు లేవన్నారు. ఎవరు ఏ పంట వేశారు?, సేద్యం ఎవరు చేశారు?

07/05/2018 - 06:06

హైదరాబాద్, జూలై 4: స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్లు కొంత మంది బుధవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ, కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.

07/05/2018 - 06:05

హైదరాబాద్, జూలై 4: టీచర్లకు కనీసం రూ 44880 రూపాయిలు వేతనం ఉండేలా చూడాలని తెలంగాణ టీచర్సు యూనియన్ తెలంగాణ రాష్ట్ర మొదటి వేతన సంఘం చైర్మన్ సీఆర్ బిస్వాల్‌ను కలిసి ప్రతిపాదనల నివేదికను అందించింది. సభ్యులు రఫత్ అలి, ఉమామహేశ్వరరావులకు కూడా కాపీలను అందించినట్టు టిటియు నేతలు మునగాల మణిపాల్‌రెడ్డి, డాక్టర్ ఏరుకొండ నరసింహస్వామి చెప్పారు.

07/05/2018 - 06:04

హైదరాబాద్, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 65 శాతంగా నిర్ణయించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మఠం శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు బుధవారం పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యుడు ఉమామహేశ్వరరావులను కలిసి 52 పేజీల వినతిపత్రం అందించారు.

07/05/2018 - 06:03

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభకు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సేవాదళ్ కార్యకర్తలు చాలా చురుకైన, కీలకమైన పాత్ర పోషిస్తారని మహారాష్ట్ర సేవాదళ్ మాజీ చీఫ్ ఆర్గనైజర్ శశికాంత్ తోరాట్ అన్నారు.

07/04/2018 - 06:20

హైదరాబాద్, జూలై 3: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ నెల 6, 7 వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల తుపాను ద్రోణి ప్రస్తుతం ఒడిషా ప్రాంతంలో స్థిరపడ్డదని తెలిపారు. ఈ కారణంగా జూలై ఆరు, ఏడు తేదీలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

07/04/2018 - 06:19

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం గ్రూప్ -1,2,3 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాని నిరుద్యోగ సమావేశం డిమాండ్ చేసింది. మంగళవారం నగరంలో ఇక్కడ నిరుద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

07/04/2018 - 06:18

హైదరాబాద్/సనత్‌నగర్, జూలై 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశామని చెప్పుకుంటున భూ ప్రక్షాళనలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆగ్రహం చేశారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జన సమితి అధ్వర్యంలో ‘్భ రికార్డుల ప్రక్షాళన - ప్రభుత్వ వైఫల్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ నిర్వహించారు.

07/04/2018 - 06:17

హైదరాబాద్, జూలై 3: ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీని అమ్మ కాదు బొమ్మ అని అంటారా?, ఇదేనా మీ సంస్కారం..!’ అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావును ప్రశ్నించారు.

Pages