S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/30/2018 - 23:43

పెద్దపల్లి, జూన్ 30: రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే డీలర్ షీప్‌లను రద్దు చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే సస్పెన్షన్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు డిమాండ్ చేశారు.

06/30/2018 - 23:42

మందమర్రి, జూన్ 30: మందమర్రి ఏరియా గనులు జూన్ మాసం లో 37 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. శనివారం జీఎం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4లక్షల 43వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 1 లక్ష 38 వేల 64 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

06/30/2018 - 23:42

మహబూబ్‌నగర్, జూన్ 30: భూరికార్డుల ప్రక్షాళన ధైర్యంతో చేపట్టిన పని అని ధైర్యం గల ముఖ్యమంత్రి ఉన్నందుకే అది సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మహబూబ్‌నగర్ మీదుగా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

06/30/2018 - 05:57

హైదరాబాద్, జూన్ 29: తీగలాగితే డొంక కదిలినట్లు నకిలీ వేలిముద్రల నిందితుడిని విచారిస్తే సిమ్ కార్డులే కాదు, రేషన్ సరుకులకు భారీగా ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. భూ దస్త్రాల రికార్డుల నుంచి వేలిముద్రలను డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా వేలాది సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసిన నిందితుడిని ఐబి, కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు లోతుగా విచారించారు. రెండు రోజుల పోలీసు కస్టడీలో అనేక విషయాలను రాబట్టారు.

06/30/2018 - 05:56

హైదరాబాద్, జూన్ 29: హైకోర్టు బార్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగిందని హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ రేణుక తెలిపారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆమె తెలిపారు. పోలింగ్ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు జిల్లా న్యాయాధికారుల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ చేపట్టారని చెప్పారు.

06/30/2018 - 01:45

పటన్‌చెరు, జూన్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. అధికారం చేపట్టిన నాటి నుండి ఆయన అరాచకాలకు అంతే లేకుండా పోయాయన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటన్‌చెరులో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

06/30/2018 - 01:42

కాటారం, జూన్ 29: దండకారణ్యంలో మళ్ళీ పోలీసుల వేట మొదలైంది. పూర్వ కరీంనగర్ జిల్లాలోని తూర్పు అడవులుగా పేరున్న ప్రాంతం, జిల్లాల పునర్విభజన అనంతరం ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలల్లోని దండకారణ్య పల్లెల్లోకి పోలీసు బలగాలు మళ్ళీ రంగప్రవేశం చేశాయి.

06/30/2018 - 01:39

బాసర, జూన్ 29: నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర అమ్మవారి క్షేత్రం అధికారులు, అర్చకుల నిర్లక్ష్యం, ఆలయం దక్షిణ, ఉత్తర రాజగోపురాల కలశాలపై తొడుగులు లేకపోవడాన్ని గమనించిన శ్రీ శృంగేరి జగద్గురు విధుశేఖర భారతీస్వామీజీ దక్షిణ, ఉత్తర రాజగోపురాలపై గల శిలాక్షరాలపై వచ్చేనెల ఐదో తేదీ సప్తమిన ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయ అర్చకులకు సూచించినట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి తెలిపారు.

06/30/2018 - 02:22

గజ్వేల్: రేషన్‌డీలర్లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మనస్తాపానికి గురైన గజ్వేల్ రేషన్‌డీలర్ వజీర్‌ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం అంబేద్కర్ సాక్షిగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రేషన్‌డీలర్లు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ రోడ్డులో సమావేశమయ్యారు.

06/30/2018 - 01:34

హత్నూర, జూన్ 29: మూడు నెలల్లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌మార్‌రెడ్డి అన్నారు. శుక్రవారంనాడు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌లో నిర్వహించిన టీఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానయ్య పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Pages