S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 04:49

గుంటూరు, డిసెంబర్ 2: నోట్లరద్దు, బంగారంపై నియంత్రణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలని వీటివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ శాశ్వత ప్రయోజనం కలుగుతుందని బిజెపి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఇబ్బందులు తప్పవని ప్రధాని ముందుగానే హెచ్చరించారని గుర్తుచేశారు.

12/03/2016 - 04:47

రేణిగుంట, డిసెంబర్ 2: పెద్దనోట్లు రద్దుతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఏర్పడిన నోట్ల కొరత నేపథ్యంలో ఆర్‌బిఐ నుంచి ప్రత్యేక విమానంలో రూ.365 కోట్లు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్ల కట్టలను 19 పెట్టెల్లో అమర్చి రేణిగుంటకు చేర్చారు. రేణిగుంట నుంచి పటిష్ఠ భద్రత మధ్య తిరుపతి ఆంధ్రాబ్యాంకుకు తరలించారు.

12/03/2016 - 04:46

విజయవాడ, డిసెంబర్ 2: రిజర్వు బ్యాంక్ నుంచి వచ్చిన నగదును వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఒత్తిడి తగ్గే వరకూ ఓవర్‌టైమ్ పని చేయాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్లతో టెలికాన్ఫరెన్సు సిఎం శుక్రవారం నిర్వహించారు.

12/03/2016 - 04:45

సత్తుపల్లి, డిసెంబర్ 2: పది శాతం కమిషన్‌కు వందనోట్లను తీసుకువస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విలేఖర్ల సమావేశంలో సత్తుపల్లి డిఎస్పీ బి.రాజేష్ వెల్లడించారు.

12/03/2016 - 04:44

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద కేటాయించిన గృహాల మంజూరు, నిర్మాణం తదితర అంశాలపై ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

12/03/2016 - 04:43

ఉప్పల్, డిసెంబర్ 2: క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టాలంటే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని బోడుప్పల్ పురపాలక సంఘం కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పురపాలక సంఘంలోని చెంగిచర్ల, బోడుప్పల్‌లోని ప్రధాన రహదార్లలో చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని శానటరీ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి, సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.

12/03/2016 - 04:33

హైదరాబాద్, డిసెంబర్ 2: నో క్యాష్ అని బ్యాంకుల్లో...నాట్ వర్కింగ్ అంటూ ఏటిఎంల ముందు బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెద్ద నోట్లతో రద్దుతో గడిచిన 24 రోజుల నుంచి మహానగరవాసులు నగదు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నల్లధనాన్ని వెలకితీసేందుకు, నకిలీ కరెన్సీ నోట్లకు బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సమర్థించిన నగరవాసుల్లో సహనం నశించింది.

12/03/2016 - 04:32

గచ్చిబౌలి, డిసెంబర్ 2: ప్రముఖ వైద్యుడి పేరుతో స్వలింగ సంపర్కుల వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఆసక్తి గలవారు కలవాలని సదరు వైద్యుని ఫోన్ నెంబరుని జత చేశాడు. సదరు వైద్యుడుకి విపరీతమైన కాల్స్ రావడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులకు అంతా చేసింది ప్రముఖ ఐటి సంస్థలో ఉద్యోగి అని తెలిపి పోలీసులు తెల్లబోయారు.

12/03/2016 - 04:31

కుషాయిగూడ, డిసెంబర్ 2: చెక్కులు డ్రా చేస్తానని చెప్పి తీసుకున్న బ్యాంక్ ఎండి ఆ మొత్తాన్ని ఖాతాదారుకు ఇవ్వకుండా తానే డ్రా చేసుకున్న ఉదంతం ఇది. ఏఎఎస్‌రావునగర్ నవభారత్ బ్యాంకులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎఎస్‌రావునగర్‌కు చెందిన సుడుగు మహేందర్‌రెడ్డి నవభారత్ ప్రైవేట్ బ్యాంకులో బామ్మర్ది పెళ్ళి కోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు.

12/03/2016 - 04:30

వికారాబాద్, డిసెంబర్ 2: తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసిఆర్ అభివృద్ధి చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 25వ వార్డులో టిఆర్‌ఎస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ను పురస్కరించుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Pages