S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్లాస్టిక్‌ను నిషేధించాలి

ఉప్పల్, డిసెంబర్ 2: క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టాలంటే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని బోడుప్పల్ పురపాలక సంఘం కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పురపాలక సంఘంలోని చెంగిచర్ల, బోడుప్పల్‌లోని ప్రధాన రహదార్లలో చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని శానటరీ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి, సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడి మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ స్థానంలో జూట్ బ్యాగులను వినియోగించాలని, వాటి తయారీకి మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తూ తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేయడానికి సహాయ సహకారం అందిస్తానని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇంటి ముందుకు వచ్చే ఆటోలలో వేయాలని, బహిరంగ ప్రదేశంలో వేస్తే జరిమానా విధిస్తున్నట్లు హెచ్చరించారు.
జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉప్పల్‌లోని స్పార్క్ కానె్సప్ట్ స్కూల్ విద్యార్థులు ప్లాస్టిక్‌ను నిషేదించాలని ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులతో షాపులలోకి వెళ్లి ప్లాస్టిక్ స్థానంలో జూట్, పేపర్ బ్యాగులను వినియోగించాలని పేర్కొన్నారు.
పేపర్ బ్యాగులను తయారు చేసి పంపిణీ చేశారు. సామాజిక స్పృహ బాల్యం నుంచే అలవరచడం ఎంతో ఆనందకరమైన విషయమని స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యాబోధన చేయాలి: డిఇఓ
ఉప్పల్, డిసెంబర్ 2: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి అన్నారు. శుక్రవారం రామంతాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి ప్రార్ధన చేశారు. విద్యారంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొస్తుందని, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఉతీర్ణతా శాతాన్ని పెంచాలన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై విద్యాబోధన చేయాలని తెలిపారు. పాఠశాలలో వౌలిక వసతుల కోసం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

నగదు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఎల్‌బినగర్, డిసెంబర్ 2: దేశంలో నగదు రహిత సమాజాన్ని నిర్మించేందుకు దేశప్రధాని నరేంద్రమోదీ ముందుకు సాగుతున్నారని, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌లో స్థానిక కార్పొరేటర్, గ్రేటర్ బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వి.రాధధీరజ్‌రెడ్డి, బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో నగదు రహిత సమాజ నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పొరేటర్ రాధధీరజ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొబైల్ బ్యాంకింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్గించి చెల్లింపుల ప్రక్రియను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రజలు తెలుసుకోవాలని తెలిపారు. కూరగాయలు విక్రయించే వారు తప్పకుండా తమ వ్యాపార కార్యకలాపాల లావాదేవీలను డిజిటల్ చెల్లింపుల ద్వారా చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ వి.్ధరజ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పిట్ట ఉపేందర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సంతోష్‌కుమార్, ప్రవీణ్, వెంకటేశ్ యాదవ్, దళిత మోర్చా నాయకులు పసుపుల హరిబాబు, రామ్‌భాయ్, రాములు, వెంకట్‌రెడ్డి, రమాకాంత్, సురేందర్‌రెడ్డి, చందు, శ్రీశైలం యాదవ్ తదితరులు ఉన్నారు.