S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీతాలొచ్చినా తప్పని తిప్పలు

హైదరాబాద్, డిసెంబర్ 2: నో క్యాష్ అని బ్యాంకుల్లో...నాట్ వర్కింగ్ అంటూ ఏటిఎంల ముందు బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెద్ద నోట్లతో రద్దుతో గడిచిన 24 రోజుల నుంచి మహానగరవాసులు నగదు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నల్లధనాన్ని వెలకితీసేందుకు, నకిలీ కరెన్సీ నోట్లకు బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సమర్థించిన నగరవాసుల్లో సహనం నశించింది. నెలరోజుల పాటు కష్టపడితే ఖాతాల్లో జీతం వచ్చినా, అవసరం మేరకు నగదు తీసుకునేందుకు వీలు లేకపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా పెట్రోలు బంకుల్లో రూ. 500 నోటు చెలామణికి శుక్రవారం రాత్రితో గడువు ముగియటంతో శనివారంతో ఇక్కట్లు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పలు ప్రైవేటు కంపెనీలు ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలను వేసినా, తమకు కావల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోలేని పరిస్థితి. ఉదయానే్నలేచి బ్యాంకు ముందు క్యూ కట్టినా, నాలుగైదు వేల కన్నా ఎక్కువ తీసుకునే అవకాశం లేదు. అలాగే ఏ ఏటిఎం చూసినా, నాట్ వర్కింగ్ అనే బోర్డులు దర్శనమివ్వటంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఫలితంగా పేద, మధ్య తరగతికి చెందిన వారు ఇంట్లో సరుకులు నిండుకుని నానా అవస్థలు పడుతున్నారు. నగదు అందుబాటులో ఉన్న ఏటిఎం ముందు గంటల తరబడి నిల్చుంటే రూ. 2వేల నోటు లభిస్తుందని, దీనికి ఎక్కడా కూడా చిల్లర లభ్యం కాకపోవటం, కొన్ని షాపులు కనీసం అయిదారు వందల వరకు కొనుగోలు చేస్తే తప్ప, చిల్లర ఇచ్చే అవకాశాల్లేకపోవటంతో జనం అవస్థలు వర్ణణాతీతం. పప్పు, ఉప్పు వరకు కొనుగోలు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం గత నెల 8వ తేదీన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి వినియోగదారులు, ఖాతాదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇపుడు జీతాలు వచ్చిన తర్వాత మరింత రెట్టింపయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ మున్సిపల్ కాంప్లెక్సులోని ఎస్‌బిహెచ్‌కు జీతాలు తీసుకునేందుకు వచ్చిన జిహెచ్‌ఎంసి ఉద్యోగులు బ్యాంకు సిబ్బందిపై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, నిత్యావసర సరుకుల కొనుగోళ్లు, పిల్లల స్కూల్ ఫీజులు వంటివి ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. వారికి కావల్సినంత నగదు అందుబాటులో లేకపోవటంతో ఇదివరకు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన వారు ఇపుడు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జీతం డ్రా చేసుకునేందుకు వచ్చిన జిహెచ్‌ఎంసి ఉద్యోగులు తమకు కావల్సినంత నగదు లభించకపోవటంతో జిహెచ్‌ఎంసి తమకు నేరుగా నగదును పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని త్వరలోనే కమిషనర్‌ను కలిసి వినతి చేసేందుకు పలు యూనియన్లు సిద్దమవుతున్నాయి.