S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 06:10

కంఠేశ్వర్, ఆగస్టు 4: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం 123జీవోను రద్దు చేయడం మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విజయం అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కోసం జీవో నెంబర్ 123ను తీసుకువచ్చి, రైతుల నుండి భూసేకరణ చేపట్టారని అన్నారు.

08/05/2016 - 06:09

నిజామాబాద్, ఆగస్టు 4: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం(ఇ-నామ్)కు ఇటీవల అనుసంధానమైన రాష్ట్రంలోని ఆయా మార్కెట్లలో 90కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి తెలిపారు. ఇ-నామ్‌కు అనుసంధానమైన వాటిలో నిజామాబాద్‌తో పాటు భాగేపల్లి, వరంగల్, మలక్‌పేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులు ఉన్నాయని అన్నారు.

08/05/2016 - 06:09

నిజామాబాద్, ఆగస్టు 4: అవినీతి ఆరోపణల్లో ముందు వరుసలో నిలిచే రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టడంతో ఇకనైనా ఆ అపప్రద నుండి సంబంధిత శాఖ అధికారులు బయటపడతారా? అన్నది సందిగ్దంగానే మారింది. ఆర్టీఎ కార్యాలయాల్లో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ ఏజెంట్లు తిష్టవేస్తూ, వివిధ పనుల కోసం వచ్చే వారిని నిలువు దోపిడీకి గురి చేయడం సర్వసాధారణ అంశంగా మారింది.

08/05/2016 - 06:08

బోధన్, ఆగస్టు 4:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కేంద్రంగా మహారాష్టల్రోని అకోలాకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఐదుగురు సభ్యులు గల ముఠా సభ్యులు ఈ గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ గంజాయి రవాణాకు కామారెడ్డి డివిజన్‌లోని ఇద్దరు వ్యక్తులు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ గంజాయిని మహారాష్టక్రు తరలిస్తున్నారు. హైటెక్ పద్ధతిలో సాగుతున్న గంజాయి రవాణాకు బోధన్ పోలీసులు ఎట్టకేలకు కళ్లెం వేశారు.

08/05/2016 - 06:07

వడ్డేపల్లి, ఆగస్టు 4: హైకోర్టు తీర్పును గౌరవించి జీవో నెంబర్ 123ను రద్దుచేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ శాసనసభ ఉపనేత సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

08/05/2016 - 06:06

నక్కలగుట్ట, ఆగస్టు 4: కెసిఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఉల్లఘించే ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ శాసన సభ ఉపనేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం బాలసముద్రంలోని జిల్లాపార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్ కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది.

08/05/2016 - 06:05

వరంగల్, ఆగస్టు 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మల్లన్నసాగర్‌పై ఎందుకంత వ్యామోహమని కేంద్ర జాతీయ విపత్తుల మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌లో రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్టు నిర్మించలేరా? అని ఆయన ప్రశ్నించారు.

08/05/2016 - 06:05

మంగపేట, ఆగస్టు 4: వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలలో ఐదవ రోజైన గురువారం అనేక మంది భక్తులు, సందర్శకులు పుష్కర స్నానాలు ఆచరించారు. జిల్లా కేంద్రంతో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు.

08/05/2016 - 06:04

నరుూంనగర్, ఆగస్టు 4: దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములలో కూడా హరితహారం కింద బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని, అందుకు గాను ఆ ప్రాంతాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దేవాదుల ఎస్సారెస్పీ ఇంజనీర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.

08/05/2016 - 06:03

వరంగల్, ఆగస్టు 4: ఉత్తమ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్ నగర శివారులోని మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Pages